తొలిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, భారత నావికా దళం సంయుక్తంగా మిలాప్ 2022 పేరిట నిర్వహించిన ఉత్సవాలు అనేక ప్రత్యేకతలకు ఆనవాలుగా నిలిచింది. ముఖ్యంగా మన జలంతర్గామి (విశాఖ ఐఎన్ఎస్) ను జాతికి అంకితం చేసిన సీఎం, అనంతరం నేవీ సిబ్బందితో మాట్లాడి వారి యోగ క్షేమాలతో పాటు దేశ రక్షణలో భాగం అవుతున్న తీరు గురించి కూడా తెలుసుకున్నారు. గగన తల విన్యాసాలు,సముద్ర జలాల్లో నావికా దళం చేసిన విన్యాసాలు ఆద్యంతం పండుగ వాతావరణాన్ని తలపించాయి.
ఆర్థిక రాజధాని విశాఖకు జగన్ నిన్నటి వేళ చేరుకుని ఇక్కడి నేవీ ఉత్సవాల్లో పాల్గొన్నారు.అదేవిధంగా ఇక్కడివారి పనితీరు గురించి తెల్సుకుని అందరినీ పేరు పేరునా అభినందించారు.మొట్టమొదటిసారి
విశాఖతీరాన నిన్నటివేళ నావికా దళ విన్యాసాలు అబ్బుర పరిచాయి. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన జీవన సహచరి భారతీ తోసహా వచ్చి వీటిని వీక్షించి వెళ్లారు.ఆపరేషన్ మిలాన్ పేరిట చేపట్టిన విన్యాసాలు చూపరులను సైతం కట్టిపడేశాయి. ఇదే సందర్భంలో ఐఎన్ఎస్ విశాఖ (యుద్ధ నౌక) ను జాతికి అంకితం చేశారు జగన్. యుద్ధ విన్యాసాలు అనంతరం స్నేహ పూర్వక దేశాలు అయిన ఆస్ట్రేలియా,అమెరికా, శ్రీలంక,బంగ్లాదేశ్,వియత్నాం