ఢిల్లీ టెస్టులో టీమిండియా విజయం బాటలో నడుస్తోంది. నిన్న బ్యాటింగ్ లో తడబడిన టీమిండియా… రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా బౌలర్లు రెచ్చి పోయారు. దీంతో ఢిల్లీ టెస్టులో 113 పరుగులకు ఆసీస్ ఆలౌట్ అయింది. దీంతో భారత్ ముందు 114 పరుగుల విజయ లక్ష్యం మాత్రం ఉంది. ఇక ఈ రెండో ఇన్నింగ్స్ లో ఏడు వికెట్లతో ఆసీస్‌ను వణికించాడు జడేజా.
అటు అశ్విన్ మూడు వికెట్లు తీశాడు. కాగా, టీమిండియా ఇప్పుడు బ్యాటింగ్ కు దిగింది. ఈ నేపథ్యంలోనే టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ తీరు మారడం లేదు. తాజాగా ఆసీస్ తో రెండో ఇన్నింగ్స్ లో మరోసారి నిరాశపరిచాడు. స్వల్ప లక్ష్యంతో రోహిత్ తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన రాహుల్, కేవలం ఒక్క పరుగుకే లియాన్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. దీంతో రాహుల్ పై ఫాన్స్ ఫైర్ అవుతున్నారు. ‘ఇంకా ఎన్ని ఛాన్స్ లు, మారావా? నువ్వు IND మ్యాచ్ ల్లో ఆడవు, IPL లో అయితే పరుగుల వరద పారిస్తావు’ అని మండిపడుతున్నారు.