స్ఫూర్తి: మాజీ సీఎం మనుమరాలు అయినా సామాన్యురాలుగా… ఐఎఫ్ఎస్ ప్యాస్.. ఈమె కథ చూస్తే మెచ్చుకుంటారు..!

-

కొంత మంది చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటారు. వాళ్లని అనుసరిస్తే మనం కూడా జీవితంలో సక్సెస్ అందుకోగలం. అనుకున్నది సాధించగలం. చాలా మంది జీవితంలో ఎన్నో అనుకుంటూ ఉంటారు. కానీ ఫెయిల్ అవుతూ ఉంటారు. వాటిని చేరుకోలేక పోతూ ఉంటారు పైగా ఈమె ఒక మాజీ ముఖ్య మంత్రి గారి మనవరాలు అయినప్పటికీ ఎటువంటి గర్వం లేకుండా సామాన్యురాలుగా ఈ విజయాన్ని అందుకున్నారు. అన్నదురై పేరు తెలియని వాళ్ళు ఉండరు.

అలాంటి మాజీ సీఎం మనవరాలు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో విజయాన్ని సాధించారు. ఈమె పేరు పృథ్వికా రాణి. యూపీఎస్సీ సివిల్స్ ర్యాంకర్ గా ఈమె సక్సెస్ అయ్యారు. మాజీ సీఎం మనవరాలు అయినప్పటికీ ఎటువంటి గర్వం లేకుండా ఈమె సాధించారు. పట్టిన పట్టు వదలకుండా మొదటిసారి పరీక్ష రాసి సక్సెస్ అయ్యారు.

జాతీయ స్థాయి లో 171 వ ర్యాంకు ఈమెకి వచ్చింది. ఐఏఎస్ అధికారి అవ్వడానికి మంచి అవకాశం ఈమెకి వున్నా ఐఎఫ్ఎస్ అధికారిక ఎంపిక చేసుకున్నారు. చాలామంది తల్లిదండ్రులని చూసి వారేమి కష్టపడక్కర్లేదు తల్లిదండ్రులే చూసుకుంటారు అని జీవితంలో దేనిని ప్రయత్నం చేయరు. అలా కాకుండా సొంత కాళ్ళ మీద నిలబడాలని అనుకుంటే కచ్చితంగా సాధించడానికి అవుతుంది. పృద్వికా రాణిని ఆదర్శంగా తీసుకుంటే జీవితంలో ప్రతి ఒక్కరూ సక్సెస్ అవ్వచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news