కొంతమందిని చూస్తే ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే మనం కూడా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోగలము. పైగా చాలామంది డబ్బులు సంపాదించాలంటే అవి ఉండాలి ఇవి ఉండాలి అని మొత్తానికి ఏమి చేయరు కానీ మీర్జాపూర్ జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో బట్టలి గ్రామం ఉంది.
ఈ గ్రామానికి చెందిన బసంత్ లాల్ పోలియో కారణంగా రెండు కాళ్ళని కోల్పోయారు. బసంత్ తండ్రి ఒక రైతు. అయితే బసంత్ కి ఆరోగ్యం బాగోకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి. కొన్ని కొన్ని సార్లు తినడానికి ఆహారం కూడా ఉండేది కాదు. ఏది ఏమైనా ఈ సమస్యలను ఎదుర్కొంటూ బసంత్ బీఏ చేశారు ఆ తర్వాత ఐటిఐ కూడా పూర్తి చేశారు.
దీని తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రయత్నం చేశారు బసంత్ కానీ అవకాశం రాకపోవడంతో పుట్టగొడుగుల పెంపకాన్ని మొదలుపెట్టారు. పుట్టగొడుగుల పండిస్తున్న రైతులతో మాట్లాడారు బసంత్. ఎక్కువ ఖర్చు అవ్వడాన్ని భూమి అవసరం లేదని తెలుసుకుని పుట్టగొడుగుల సాగుని మొదలుపెట్టారు.
బసంత్ రాంచికి చెందిన ఐబిఆర్ నుండి శిక్షణ కూడా తీసుకున్నారు. బసంత్ పుట్టగొడుగుల పొడిని తయారు చేయడం మొదలుపెట్టారు. ఆదాయం రెట్టింపు అయింది ఇలా క్రమంగా వ్యాపారాన్ని విస్తరించుకుంటూ వెళ్లారు ఇప్పుడు ఏడాదికి లక్షన్నర రూపాయలు పొదుపు చేస్తున్నారు. పైగా పుట్టగొడుగుల పెంపకం పై శిక్షణ కూడా ఇస్తున్నారు. ఈ శిక్షణ ఇవ్వడం ద్వారా కొంతమందికి ఆదాయం కూడా వస్తోంది. నిజంగా గొప్ప విషయం కదా చాలామంది ఏం చేయాలో తెలీక ఏమీ చేయకుండా ఉండిపోతున్నారు. అటువంటి వాళ్ళు ఈయనని ఆదర్శంగా తీసుకుంటే జీవితంలో ముందుకు వెళ్లొచ్చు.