ఇన్‌స్టాగ్రాం యూజర్లకు ఆ యాప్ తాజాగా ఓ అద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇన్‌స్టాగ్రాంలో ఇకపై యూజర్లు ఏకంగా 4 గంటల పాటు లైవ్ స్ట్రీమింగ్ చేయవచ్చు. అలాగే లైవ్ స్ట్రీమింగ్ వీడియోలను యూజర్లు తమ తమ ఇన్‌స్టాగ్రాం అకౌంట్లలో 30 రోజుల పాటు సేవ్ చేసుకోవచ్చు. దీంతోపాటు ఐజీటీవీ యాప్‌లో లైవ్ నౌ పేరిట కొత్తగా సెక్షన్‌ను ఇచ్చారు. అందులో మరిన్ని లైవ్ వీడియోలను చూడవచ్చు.
ఇన్‌స్టాగ్రాం యాప్ ఈ ఫీచర్లను కొత్త అప్‌డేట్ రూపంలో అందిస్తున్నట్లు ట్వీట్ ద్వారా వెల్లడించింది. ఈ ఫీచర్లను వాడుకోవాలనేవారు యాప్‌ను నూతన వెర్షన్‌కు అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక కరోనా నేపథ్యంలో చాలా మంది లైవ్ స్ట్రీమింగ్‌ను ఆశ్రయిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో ఇన్ స్టాగ్రామ్‌లో లైవ్ వీడియోలను పెట్టే వారి సంఖ్య గతంలో కన్నా 70 శాతం వరకు పెరిగింది. అందుకనే ఈ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చామని ఇన్‌స్టాగ్రాం వెల్లడించింది.
ఇక ఇన్‌స్టాగ్రాంలో ఇప్పటికే షార్ట్ వీడియోస్, ఫొటోస్ ఫీచర్ అందుబాటులో ఉంది. దీనికి తోడుగా లైవ్ వీడియోలను పెట్టే అవకాశం కూడా కల్పించారు. ప్రస్తుతం లైవ్ స్ట్రీమింగ్ టైంను 4 గంటలకు పొడిగించారు. నిరంతరం లైవ్ స్ట్రీమ్ చేసేవారికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని ఇన్‌స్టాగ్రాం తెలియజేసింది.