గత ప్రభుత్వ నిర్ణయాల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న ప్రస్తుత ఏపీ ప్రభుత్వం ఆ ప్రభుత్వ హయాంలో జరిగిన చాలా విషయాలని, కార్యక్రమాలని రద్దు చేస్తూ పోతోందన్న సంగతి తెలిసిందే. తాజాగా రాయలసీమ స్టీల్ ప్లాంట్ కార్పోరేషన్ (RSCL) రద్దు చేసింది. ఏపీ హైగ్రేడ్ స్టీల్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటుతో రాయలసీమ స్టీల్ ప్లాంట్ కార్పోరేషన్ ను రద్దు చేస్తున్నామని చెబుతూ ఉత్తర్వులు జారీ కూడా అయ్యాయి. అయితే ఇప్పుడు దానికి వైఎస్సార్ పేరు పెట్టింది ఏపీ ప్రభుత్వం.
ఏపీ హైగ్రేడ్ స్టీల్ కార్పోరేషన్ లిమిటెడ్ పేరును వైఎస్సార్ స్టీల్ కార్పోరేషనుగా నామకరణం చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏపీ హైగ్రేడ్ స్టీల్ లిమిటెడ్ కంపెనీ అంటే వైఎస్సార్ స్టీల్ కార్పోరేషను పర్యవేక్షణలోనే కడప స్టీల్ ప్లాంట్ వ్యవహారాలు జరగనున్నాయి. కేంద్రాన్ని స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయమని కోరీ కోరీ విసుగు చెంది టీడీపీ హయాంలో ఈ రాయలసీమ స్టీల్ ప్లాంట్ కార్పోరేషన్ ని ఏర్పాటు చేసింది అప్పటి ప్రభుత్వం.