తెలంగాణలో నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు

-

తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి ఇంట‌ర్మీడియ‌ట్ ప్రాక్టిక‌ల్ ప‌రీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇంట‌ర్మీడియ‌ట్ లో సైన్స్ తో పాటు ఓకేషన‌ల్ విద్యార్థుల‌కు ప్రాక్టిక‌ల్ ప‌రీక్షలు నేటి నుంచి జ‌ర‌గ‌నున్నాయి. ఈ రోజు నుంచి ఏప్రిల్ 8 వ తేదీ వ‌ర‌కు ఈ ప్రాక్టిక‌ల్ ప‌రీక్షలు ఇంట‌ర్ బోర్డు అధికారులు నిర్వ‌హించ‌నున్నారు. ఈ ప్రాక్టిక‌ల్ ప‌రీక్షల కోసం ఇప్ప‌టికే ఏర్పాట్ల‌ను తెలంగాణ రాష్ట్ర ఇంట‌ర్ బోర్డు అధికారులు పూర్తి చేశారు.

ఉద‌యం, మ‌ధ్య‌హ్నం రెండు స‌మ‌యాల్లో ప్రాక్టిక‌ల్ ప‌రీక్షలు జ‌ర‌గ‌నున్నాయి. మొద‌ట ఉద‌యం 9 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు మొద‌టి విడుత‌ ప్రాక్టిక‌ల్ ప‌రీక్షలు జరుగుతాయి. అలాగే మ‌ధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వ‌ర‌కు త‌ర్వాతి విడుత ప్రాక్టిక‌ల్ ప‌రీక్షలు జ‌రుగనున్నాయి. అలాగే ఇంటర్ ప్రాక్టిక‌ల్ ప‌రీక్షల కోసం ఇంట‌ర్ బోర్డు అధికారులు ఇప్ప‌టికే ఏర్పాట్ల‌ను పూర్తి చేశారు. అలాగే విద్యార్థుల హాల్ టికెట్ల‌తో పాటు ప్రాక్టిక‌ల్ ప‌రీక్షల టైమ్ టేబుల్ ను సైతం ఇది వ‌ర‌కే విడుద‌ల చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news