తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు

హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ సెకండ్‌ ఇయర్‌ పరీక్షలు రద్దయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఫస్ట్ ఇయర్ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఫస్టియర్‌లో గ్రేడులు ఇచ్చి విద్యార్థులను ఉత్తీర్ణులను చేశారు. ఇప్పుడూ అదే విధంగా సెకండ్ ఇయర్ విద్యార్థులను కూడా పాస్ చేయనున్నారు. కరోనా నేపథ్యంలో పరీక్షలు నిర్వహించడం కష్టతరంగా మారడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు, ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను సైతం రద్దు చేస్తున్నట్లు గత ఏప్రిల్‌ నెలలో ప్రకటించారు. పరీక్షలు లేకుండానే విద్యార్థులనుపై తరగతులకు ప్రమోట్ చేశారు.