ఇప్పటికీ సినీ ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది నటీనటులు నటనపై ఆసక్తితో ఎన్నో ఉన్నత చదువులు చదివిన వారు కూడా వాటిని పక్కన పెట్టి ప్రేక్షకుల ముందు నటించి వారి ఆదరాభిమానాలు పొందుతున్నారు. ఇప్పటికే నాగార్జున, శేఖర్ కమ్ముల , సాయి పల్లవి, రాజశేఖర్ లాంటి ఎంతో మంది ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ లాంటి ఉన్నత చదువులు చదివి నటన మీద ఆసక్తితో అత్యున్నత పదవులను కూడా మొదలుకొని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇకపోతే ఇక్కడ ఒక నటుడు ఏకంగా కొన్ని వేల మంది ఎదురు చూసే గూగుల్ లో జాబ్ సంపాదించి.. చివరికి నటన మీద ఆసక్తితో జాబ్ వదులుకున్నాడు. ఇక ఆయన ఎవరు అనే విషయాన్ని ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.
టాలీవుడ్లో ప్రముఖ కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న మధునందన్. హీరోలకు ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటిస్తూ తన కామెడీతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు. ఇకపోతే ఇటీవల ఒక ఛానల్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో మధునందన్ మాట్లాడుతూ హైదరాబాద్ గూగుల్ లో తాను పని చేశానని తెలిపారు. తన తల్లిదండ్రులు చదువుకోవాలని, జాబ్ చేయాలని చెప్పారని .. వారి కోరిక మేరకు చదువుకొని, జాబ్ చేసి పెళ్లి కూడా అయిపోయిందని.. ఇక తన వైఫ్ నుంచి మంచి సపోర్ట్ కూడా లభించింది అని ఆయన తెలిపారు. తన భార్య ఎంబీఏ పూర్తి చేసిందని.. తాను కూడా కొన్ని సంవత్సరాల పాటు ఉద్యోగం చేసిందని.. తన పెళ్లి తర్వాత జాబ్ కు దూరంగా ఉందని మధునందన్ తెలిపారు.
ఇకపోతే ప్రస్తుతం ఉన్న టెక్నాలజీకి ఇంటి నుంచి కూడా పని చేయవచ్చు అని మధునందన్ తెలిపారు. ఇక తాను ఉప్పల్ లో ఉంటానని లిరిక్ రైటర్ కృష్ణ చైతన్య కూడా చాలా క్లోజ్ అని కూడా తెలిపారు. తల్లిదండ్రుల కోరిక మేరకు చదువుకొని ఉద్యోగం చేసి.. నటన మీద ఆసక్తితో నా కోరిక నెరవేర్చుకోవడానికి ఉద్యోగానికి పులిస్టాప్ పెట్టాను అని చెప్పాడు మధునందన్.