తెలుగు ప్రేక్సకులు విభిన్నమైన కథలను సరికొత్త ఆలోచనలను ఆదరిస్తారు. సినిమా చూసే సమయంలో వారిని నిరంతరం ఆకర్షించగలిగితే.. ఆ చిత్రం ఎంత చిన్నదైనా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది. ముఖ్యంగా మర్డర్ మిస్టరీ జానర్ లోని ఉత్కంఠ, స్క్రీన్ ప్లే ప్రేక్సకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు వైవిద్యమైన కథాంశంతో థ్రిల్లింగ్ అనుభవాన్ని అందించేందుకు సిద్ధం అవుతున్న చిత్రం తత్వం. దినేష్ తేజ్, దష్విక హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి అర్జున్ కోల దర్శకత్వం వహిస్తున్నారు.
త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కే.ప్రొడక్సన్స్ సంస్థల సమిష్టి నిర్మాణంలో వంశీ సీమకుర్తి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ దర్శకుడు మారుతి, కల్ట్ సినిమాల నిర్మాత ఎస్కేఎన్ తమ సోషల్ మీడియా ద్వారా విడుదల చేసి చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు. తత్వం చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసిన మారుతి, ఎస్కేఎన్ గార్లకు కృతజ్ఞతలు తెలిపారు దర్శకుడు అర్జున్ కోల.