ఏపీ అధికారపార్టీ వైసీపీలో ఏం జరుగుతోంది? సీనియర్ నాయకులు ఏం చేస్తున్నారు? పార్టీని డెవలప్ చేసే క్రమంలో నాయకు లు ఉన్నారా? లేక పార్టీలో విభేదాలు సృష్టించేందుకు పోటీ పడుతున్నారా? అనే విషయంపై చర్చ సాగుతోంది. ఇప్పటికే చిత్తూ రు జిల్లా సహా కొన్ని జిల్లాల్లో సీనియర్ నేతలు పార్టీ నేతల విషయంలో అనుసరిస్తున్న వైఖరికారణంగా పార్టీపై విమర్శలు వస్తు న్నాయి. ఇదిలావుంటే, ఇప్పుడు మరో కీలక నాయకుడు, సీనియర్ మంత్రి, విజయనగరం జిల్లాకు చెందిన బొత్స సత్యనారా య ణ వ్యవహార శైలి కూడా పార్టీలో తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఆయన చేస్తున్న వ్యవహారంతో పార్టీ బాగుపడుతుందా? లేక నాశనం అవుతుందా? అనే కోణంలోనూ చర్చ సాగుతుండడం గమనార్హం.
విషయంలోకి వెళ్తే.. విజయనగరం జిల్లాలో కీలక నాయకుడిగా ఎదిగారు మంత్రి బొత్స. తన భార్య ఝాన్సీరాణిని కూడా గతంలో కాంగ్రెస్ టికెట్‌పై ఎంపీగా గెలిపించుకున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జ్‌గా కూడా వ్యవహరించారు. తర్వాత మంత్రిగా కూడా చక్రం తిప్పారు. వైఎస్ సహా కిరణ్‌కుమార్ రెడ్డి, రోశయ్యల ప్రభుత్వాల్లో మంత్రిగా కూడా పనిచేశారు. ఇక, రాష్ట్ర విభజన తర్వాత ఆయ న వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయినా కూడా 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. ఇక, గత ఎన్నికల్లో గెలిచి మంత్రి కూడా అ య్యారు. అయితే, జిల్లా మొత్తంగా కూడా తన హవానే చలామణి కావాలనే నైజం ఉన్న బొత్స ఇప్పుడు వైసీపీలోనూ అదే తర హాలో వ్యవహరిస్తున్నారు. దీంతో వర్గాల మధ్య పోరు పెరిగింది.
తనకు నచ్చిన వారికి, తన వర్గం వారికి బొత్స ప్రోత్సాహం ఇస్తున్నారు. తన కన్నా సీనియర్లు, లేదా తన మాట వినననేవారిని లేదా పార్టీ అధిష్టానంతో నేరుగా సంబంధాలు ఉన్న నాయకులను ఆయన అణిచి వేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో విజయనగరంలో సీనియర్ నాయకుడు, బొత్సకు సమకాలికుడు అయిన వైశ్య సామాజిక వర్గానికి చెందిన కోలగట్ల వీరభద్రస్వా మిని అడుగడుగునా అడ్డుకుంటున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆయనకు మంత్రి పదవి రాకుండా బొత్సనే చక్రం తిప్పా రనే వాదన ఉంది. ఇక, ఆయన కుమార్తెకు జెడ్పీ పీఠం దక్కకుండా ఉన్నస్థానాలను బీసీలకు రిజర్వ్ అయ్యేలా వ్యవహరించారని కూడా బొత్సపై విమర్శలు వున్నాయి.
ఇక, ఇదే జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణిని కూడా పక్క నపెట్టేందుకు బొత్స ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. వైసీపీ అధిష్టానంతో నేరుగా సంబంధాలు ఉన్న శ్రీవాణి దూకుడు కు చెక్ పెట్టకపోతే..తన హవా సాగదని బొత్స భావిస్తున్నట్టు చెబుతున్నారు. మరి ఈ తరహా రాజకీయ వ్యూహాలు పార్టీని బలోపేతం చేస్తాయా? లేక బలహీన పరుస్తాయా? అనే చర్చ జోరుగా సాగుతుండడం గమనార్హం.