ఉత్తరాంధ్ర ప్రజలకు సహాయం చేసే విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ముందు ఉంటారు. కిడ్నీ బాధితులను ఆదుకోవడానికి అయినా మరొకరకంగా అయినా సరే ఆయన ఉత్తరాంధ్ర మీద ఎక్కువగా ప్రేమ చూపిస్తూ ఉంటారు. తాజాగా ఇలాంటిదే ఒకటి జరిగింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొంత మంది జాలర్లు, ఇతరులు చెన్నై హార్బర్‌లో చిక్కుకున్నారు. వాళ్లకు సరైన ఆహార సదుపాయాలు లేక ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది.
దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్… వారి కోసం ముందుకి వచ్చారు. వారిని ఆదుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామికి ఆయన లేఖ రాసారు. దీనిపై తమిళనాడు ప్రభుత్వం స్పందించింది. వారికి సహాయం చేయడానికి ముందుకి వచ్చింది అక్కడి ప్రభుత్వం. ఈ విషయాన్ని పళని స్వామి నేరుగా ట్విట్టర్ లో వెల్లడించారు. వెంటనే చెన్నైలోని శ్రీకాకుళం జాలర్లకు ఇవాళ్టి నుంచి ఆహారం వసతి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.
విమర్శలు చేయకుండా పవన్ కళ్యాణ్ వేగంగా స్పందించి లేఖ రాయడం తో అక్కడి ప్రభుత్వం కూడా దీనిపై సానుకూలంగా స్పందించింది. కాగా కరోనా సాహయం కింద పవన్ కళ్యాణ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రెండు కోట్ల సహాయం చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల పవన్ కళ్యాణ్ ఈ సహాయం ప్రకటించారు. తమిళనాడు ప్రభుత్వానికి ఆయన ధన్యావాదాలు తెలిపారు.