అదేం ఖర్మమో కానీ.. రాష్ట్రంలో ఏం జరిగినా.. టీడీపీ అధినేత చంద్రబాబు మెడకు చిక్కుకుంటోంది. అది ఏదైనాకానీ.. ఆయనకే కేంద్రంగా మారుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు ప్రధాన మీడియాల్లో పాత్రికే యులను ఆయా మీడియా అధిపతులు రోడ్డున పడేస్తున్నారు. కనీసం వారికి దారి కూడా చూపించకుండా లాక్‌డౌన్ నెపం చూపించి వదిలించుకుంటున్నారు. ఇప్పటికే చంద్రబాబు అనుకూల మీడియాల్లో దాదాపు నాలుగు వేల మంది ఉద్యోగులు ఇంటికి పరిమితమయ్యారు. మరి నిత్యం మీడియానే నమ్ముకుని, మీడియాలోనే ఉన్న చంద్రబాబు.. ఈ విషయాన్ని పట్టించుకోలేదా?
బాబు కనుసైగ చేస్తే.. ఆయన వార్తలను పుంఖాను పుంఖాలుగా ప్రచురించిన, ఆయన కార్యక్రమాలను లైవ్ లో చూపించిన ఈ మీడియా అధిపతులు పరోక్షంగా ఉన్నా..ప్రత్యక్షంగా వాటిని రాసింది.. ప్రసారం చేసిం ది కూడా పాత్రికేయులే కదా? పోనీ.. చచ్చు..పుచ్చు బ్యాచ్‌ను ఇప్పుడు బయటకు పంపేశాం.. అని దద్ద మ్మ మాటలు చెబుతారా? అంటే.. మరి ఆ చచ్చు పుచ్చుకు ఎందుకు ఎగ్జామ్‌లు పెట్టారు. ఎందుకు అప్పా యింట్ మెంట్లు ఇచ్చారు.ఎందుకు ఇన్నాళ్లు భరించారు. ఎందుకు వెల్ఫేర్ ఫండ్‌లను వసూలు చేశారు? ప్రస్తుతం లాక్‌డౌన్ ఉంది కాబట్టి.. తాము రోడ్డున పడతాం అంటారా? మరి బాబుగారి హయాంలో కోట్లకు కోట్లు ప్రకటనల రూపంతో దోచుకున్నారుగా? అదేమైంది?
మరి ఇప్పుడు ఇవన్నీ ఎవరు అడగాలి? లాక్‌డౌన్ పేరుతో ప్రభుత్వం జీతాలను సగం ఇస్తామని చెప్పిన ప్పుడు చంద్రబాబు గళం విప్పారు. ఇంటి నుంచే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మరి పాత్రికేయులకు దశ-దిశ లేకుండా చేసిన తన అనుకూల మీడియాను ప్రశ్నించాల్సిన అవసరం చంద్రబాబుకు లేదా? నాడు అధికారంలో ఉన్నప్పుడు పాత్రికేయులను ఎంతో ఆదరంగా చూస్తానని చెప్పిన బాబు మాటలు ఇప్పుడు మూగబోయాయా? ఎందుకు ప్రశ్నించడం లేదు. ఆ మీడియా అధిపతులకు ఆయన భయపడుతున్నా రా? లేక ఎవరు ఎలా పోయినా తనకెందుకు అనుకుంటున్నారా? ఇప్పుడు ఈ ప్రశ్నలే చంద్రబాబును ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.
ఏం చేయాలి? అని తలపట్టుకున్నారు. అటు అనుకూల మీడియాలకు చెప్పే దమ్ములేక, ఇటు పాత్రికేయులు సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక .. సొంతింట్లో తలపట్టుకుని కూర్చున్నారట బాబు. మరి ఇప్పటికైనా ఆయన మౌనం వీడాలనేది పాత్రికేయుల మాట. మరి చరిత్ర సృష్టిస్తారో.. చరిత్రలో కలిసిపోతారో చూడాలి.