మ‌రో రెండు వారాలు క‌రోనా జ‌ప‌మే… ఏపీ, తెలంగాణ‌లో ఇంత ప్ర‌మాద‌మా..?

-

రాష్ట్రం, దేశం అంతా కూడా క‌రోనా జ‌ప‌మే క‌నిపిస్తోంది. అక్క‌డ ఇన్ని కేసులు న‌మోద‌య్యాయి. ఇక్క‌డ అ న్ని కేసులు న‌మో ద‌య్యాయి. వీటిలో కొత్త‌వి ఇన్ని.. అక్క‌డ క‌రోనా రెండో ద‌శ ప్రారంభం.. అయిపోయి మూడో ద‌శ‌కు చేరుకుంటోంది. ప్ర‌స్తుతం దేశంలో విదేశీయుల‌కు బంద్‌. రాష్ట్రాల స‌రిహ‌ద్దులు మూసేశారు. దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్‌లు. అయినా ప్ర‌జ‌లు రోడ్ల‌మీద‌కు వ స్తూనే ఉన్నారు. పోలీసులు త‌మ ఆంక్ష‌ల‌ను తీవ్ర‌త‌రం చేశారు. ఇదీ.. ఇప్పుడు ఏ మీడియా ఛానెల్ ను తి ప్పినా క‌నిపిస్తున్న వార్త‌లు, బ్రేకింగులు. అంతే త‌ప్ప నిత్యం సంద‌డి చేసే రాజ‌కీయాలు ఒక్క‌సారిగా మూ గ‌బోయాయి. తెల్ల‌వార‌గానే పాఠ‌కుల చేతిలో సంద‌డి చేసే వార్తా ప‌త్రిక‌లు  ఉద‌యం ఏడు గంట‌ల లోపే ప్ర‌జ‌లు వార్త‌ల‌ను వండి వ‌డ్డించేస్తున్నాయి.

ఉద‌యం 9 దాటితే.. క‌ర్ఫ్యూ పేరుతో ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రారు. అంతేకాదు, అటు దేశం లోను, ఇటు రాష్ట్రంలోనూ కూడా రాజ‌కీ యాలు పెద్ద‌గా జ‌ర‌గ‌డం లేదు. దీనికి ప్రబుత్వం వైపు నుంచి ఎలాంటి యాక్టివిటీ లేక‌పోవ‌డం ఒక కార‌ణం. అదేస‌మ‌యంలో క‌రోనాతో రాష్ట్రం మొత్తం అల్లాడి పోతుంటే.. వీళ్లేంటి రాజ‌కీయాలు మాట్లాడుతున్నారు? ప‌్ర‌జలు ఎలా పోయినా ఫ‌ర్లేదా? అనే వ్య‌తిరేకత ప్ర‌జ‌ల నుంచి వ‌స్తుందేమోన‌ని నాయ‌కులు కొంత జంకు తున్నారు. అయిన‌ప్ప‌టికీ.. కోర్టు తీర్పుల నేప‌థ్యంలో టీడీపీ నాయ‌కులు త‌ప్ప ఎవ‌రూ పాలిటిక్స్ మాట్లాడ‌డం లేదు. దీంతో క‌రోనాదే పైచేయి అయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇక‌, మే 3 వ‌ర‌కు కూడా దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. దీంతో అప్ప‌టి వ‌ర‌కు కూడా క‌రోనానే కీల‌కంగా మార‌నుంది. అదేస మ‌యంలో దేశంలో కేసులు కూడా పెరుగుతున్నాయి. ఏపీలోనే పాజిటివ్ కేసులు 500 పెరిగిపోయాయి. ఇక‌, మ‌ర‌ణాలు కూడా 11కు చేరుకున్నాయి. అదేస‌మ‌యంలో క‌రోనా ల‌క్ష‌ణాల‌తో ఉన్న‌వారి సంఖ్య 8 వేలుగా ఉంద‌ని మంత్రి ఆళ్ల‌నాని ప్ర‌క‌టించ‌డాన్ని బ‌ట్టి కేసుల తీవ్ర‌త ఎలా ఉందో తెలుస్తుంది.

మొత్తంగా చూస్తే.. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగింది ఒక ఎత్త‌యితే.. రాబోయే రెండు వారాలు మ‌రింత‌గా ప్ర‌మాద‌క‌ర‌మ‌నే సంకేతాలు వైద్యుల‌నుంచి కూడా వెలువ‌డుతున్నాయి. దీంతో మ‌రో రెండు వారాల పాటు క‌రోనా జ‌ప‌మే దేశ‌వ్యాప్తంగా జ‌ర‌గ‌నుంది. మ‌రి ఈ స‌మ‌యంలో మూడో ద‌శ వ్యాప్తి చెంద‌కుండా ప్ర‌జ‌లు అత్యంత జాగ్ర‌త్తలు త‌ప్ప‌వు. ప్ర‌స్తుతం ఇత‌ర దేశాల‌ను చూస్తే.. ఈ మాత్రం జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌వు మ‌రి !!

Read more RELATED
Recommended to you

Latest news