ఏపీలో సంచలనం; లక్షణాలు లేకుండా వంద మందికి కరోనా…!

-

ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన దాని ప్రకారం కరోనా వైరస్ లక్షణాలు 103 డిగ్రీల వరకు జ్వరం, ఊపిరితిత్తులు పగిలిపోతాయనే స్థాయిలో పొడిదగ్గు, శ్వాస తీసుకోవడం కష్టం కావడం వంటి లక్షణాలు క్రమంగా కనపడతాయి. ఒక్కొక్కటి బయటపడుతుంది. వ్యాధి తీవ్రత ఆ విధంగా పెరిగే అవకాశం ఉంటుంది. కాని ఏపీలో మాత్రం ఇలాంటి పరిస్థితి కనపడట౦ లేదు. గుంటూరు జిల్లాలో నమోదు అయిన కేసులు ఇలాగే ఉన్నాయి

వంద మందికి కరోనా లక్షణాలు లేకుండా కరోనా వైరస్ బయటపడింది. ఆరోగ్యంగా ఉన్నామని రోడ్ల మీద తిరిగిన వాళ్లకు కరోనా బయటపడింది. ఆర్‌టీ పీసీఆర్‌ టెస్టుల్లోనూ వైరస్‌ ఉన్నట్టు వెల్లడైంది. అసలు లక్షణాలు లేకుండా కరోనా ఎలా వచ్చింది అనేది అర్ధం కావడం లేదు. విదేశాలకు వెళ్ళిన వాళ్ళు,ఢిల్లీ మర్కాజ్ కి వెళ్లి వచ్చిన వారిని గుర్తించి పరిక్షలు నిర్వహించగా అప్పుడు కరోనా బయటపడింది.

లక్షణాలు కనిపించని కారణంగా చాలామంది క్వారంటైన్‌కు వెళ్లి పరీక్షలు చేయించుకోవడం లేదు. దీనితో వారి వలన కరోనా కాంటాక్ట్స్ పెరుగుతున్నాయి. లక్షణాలు లేవు అని తిరుగుతున్నారు కొందరు. పరీక్ష చేయించుకోవడం కొంత మంది నామోషి గా భావిస్తున్నారు. కాని అలా వద్దని చిన్న తేడా అనిపించినా, ఏదైనా అనుమానం ఉంటే వెంటనే పరిక్షలు చేయించుకోవాలి అని వైద్యులు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news