కరోనా మహమ్మారి నుంచి భారత్ తనను తాను అత్యంత భద్రంగా కాపాడుకుంటోందా? అంటే.. తాజా పరి ణామాలను గమనిస్తే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. అయితే, ఇప్పటికి రెండు వందల పైచిలుకు మరణాలు నమోదైనప్పటికీ.. మిగిలినపెద్ద దేశాలతో పోల్చుకుంటే.. భారత్ రక్షణ పరిధిలోనే ఉంది. ముందస్తుగా తీసుకున్న లాక్‌డౌన్ నిర్ణయం, కర్ఫ్యూ, ప్రజలను లౌక్యంగా కరోనా రక్షణ వైపు తిప్పడం వంటివి నిజంగానే మంచి ఫలితాన్ని ఇచ్చాయి. అయితే, లాక్‌డౌన్ విషయంలో ఓ వర్గం ప్రజలు తీవ్ర ఆవేదన , ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు.
ఇంకా ఎన్నాళ్లు ఈ కరోనా లాక్‌డౌన్ ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నవారు కూడాఉన్నారు. అంతేకా దు, ప్రభుత్వాలపై విమర్శలు కూడా చేస్తున్నారు. మరి ఇలాంటి వారికి చెప్పాలని అంటున్న విషయం ఏంటంటే.. అమెరికా ను చూసి తెలుసుకోండి! అని!! ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వైరస్ కారణంగా మృతి చెందుతున్న వారు అగ్రరాజ్యంలోనే ఎక్కువగా ఉన్నారు. ఇప్పటి వరకు 21 వేల మంది ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. గంటకు 85 మంది చొప్పున మరణిస్తున్నారు. అంటే.. ఎంత వేగంగా ఈ వైరస్ విజృంభిస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
అక్కడ కూడా లాక్‌డౌన్ విషయంలో ప్రజలు సహా అధ్యక్షుడు ట్రంప్ కూడా లెక్కచేయలేదు. అసలు లాక్‌డౌన్ ఎందుకు? మనదేమన్నా.. చిన్న దేశమా? అంటూ.. బీరాలు పలికారు. లాక్‌డౌన్ అవసరమే తమకు రాదని, అన్ని సదుపాయాలు ఉన్నాయని, అసలు కోరానా అనేది చాలా చిన్న అంశమని చెప్పుకొచ్చారు. ఇలా ఆయన ప్రకటించిన నెల రోజుల్లోనే అమెరికాలో కరోనా విజృంభణ పెరిగిపోయింది. ఇప్పుడు అసలు కట్టడి చేసే పరిస్థితిని కూడా దాటిపోయింది.
దీంతో అధికారికంగా అక్కడి అధ్యక్షుడు ట్రంప్ ఏం చెబుతున్నారో .. తెలుసా? మాదేశంలో కరోనాతో 60 వేల మంది చచ్చిపోయే అవకాశం ఉంది! అని!! ఇప్పటికే ఆరు లక్షల మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. సో.. లాక్‌డౌన్ చేసుకున్న వియత్నాం. ఈ క్వెడార్, పక్కనే ఉన్న నేపాల్ వంటి దేశాలు సుఖంగా ఉండగా.. లాక్‌డౌన్‌పై ఉదాసీనంగా ఉన్న అమెరికా ఇప్పుడు అతలాకుతలం అవుతోంది. మరి ఇది చదివాక కూడా లాక్‌డౌన్ భారం అవుతుందా? సో.. ఇంటికే పరిమితం అవుదాం.. కరోనాను కట్టడి చేద్దాం.. బీ స్టే ఎట్ హోమ్.. బీ సేఫ్ ఎట్ హోమ్!!