అసలే కడప జిల్లా. వైసీపీ అధినేత జగన్‌కు కొట్టిన పిండి వంటి నియోజకవర్గాలు. మరి అలాంటి చోట ప్రతి పక్షం టీడీపీ ఎలా ముందుకు సాగాలి? ఎలా వ్యవహరించాలి? ప్రజలకు ఎలా చేరువ అవ్వాలి? నాయకులు కలిసిమెలిసి ఎలా ఉండాలి? మరి అలా ఉన్నారా? వైసీపీకి చెక్ పెట్టే రేంజ్లో నాయకులు దూకుడు ప్రద ర్శిస్తున్నారా? లేక తమలో తాము ఫైటింగులు చేసేసుకుంటు న్నారా? అంటే ఫైటింగులు చేసేసుకుంటు న్నారనే అంటున్నారు పరిశీలకులు. గత ఏడాది ఎన్నికలకు ముందు, తర్వాత ప్రొద్దుటూరు టీడీపీ పరిస్థితి చిత్రంగా మారిపోయింది. ఎన్నికల సమయంలో ఉన్న నాయకులు చాలా మంది పార్టీకి దూరమ య్యారు.
ముఖ్యంగా సీఎం రమేష్, వరదరాజుల రెడ్డి వంటివారు తమ దారి తాము చూసుకున్నారు. దీంతో గత ఎన్ని కల్లో ఇక్కడ నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డికి చంద్రబాబు పార్టీ బాధ్యతలు అప్పగించారు. అయితే, ఈయన వైసీపీ నాయకుడు రాచమల్లు శివప్రసాద్‌రెడ్డితో లోపాయికారీ ఒప్పందం చేసుకుని వ్యవహ రిస్తున్నారనే ఆరోపణలు వినిపించాయి. దీనిపై చంద్రబాబుకు కూడా ఫిర్యాదులు అందాయి. కొన్నాళ్ల పాటు ఈ విషయంలో సైలెంట్‌గా ఉన్న చంద్రబాబు.. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో మాత్రం అనూహ్యమైన మార్పు చేశారు. ఇక్కడ పార్టీ ఇంచార్జ్‌గా ఉక్కు ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని నియమించారు.
దీంతో ఇప్పటి వరకు ఉన్న లింగారెడ్డి ఆధిపత్యానికి గండికొట్టినట్టయింది. దీంతో ప్రవీణ్ కుమార్‌ను ఉద్దే శించి ఓ వీడియో ఆయన విడుదల చేశారు. ప్రొద్దుటూరు స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయకర్తగానే ఉక్కు ప్రవీణ్‌ను నియమించారని, నియోజకవర్గ ఇన్చార్జ్గా తానే కొనసాగుతానని ఆయన ప్రకటించు కున్నాడు. అంతేకాదు, లింగారెడ్డి తన అనుచరులతో సోషల్ మీడియాలో తనకుఅనుకూలంగా ప్రచారం చేస్తున్నారు. ఇలా టీడీపీలో ఆధిపత్య, పదవీ పోరు ఓరేంజ్‌లో సాగుతోంది.
మొత్తంగా చూస్తే.. వైసీపీకి బలమైన జిల్లా కడపలో ప్రొద్దూటూరులో టీడీపీ అనుసరించాల్సి న వ్యూహం ఇదికాదనే వాదన మాత్రం బలంగా వినిపిస్తోంది. అదేసమయంలో రాచమల్లు వ్యూహాత్మకంగా టీడీపీని దెబ్బకొట్టినా దానికి తగిన విధంగా ప్రణాళిక వేసుకుని చంద్రబాబు వ్యవహరించలేదని అంటున్నారు. మొత్తానికి రాచమల్లు దూకుడుతో ప్రొద్దుటూరులో టీడీపీ అభాసు పాలవుతోందని అంటున్నారు.