ఆసక్తికరంగా “ఊర్వశివో రాక్షసివో” ట్రైలర్ !

-

టాలీవుడ్‌ యంగ్‌ హీరో… అల్లు శిరీష్  “ఊర్వశివో రాక్షసివో” అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. గీత ఆర్ట్స్ బ్యానర్ వారు సమర్పిస్తున్న ఈ సినిమాకి విజయ్ – విరాజ్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రంలో అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. అచ్చు రాజమణి సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రానికి రాకేష్ శశి దర్శకత్వం వహించారు.

ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్, పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్‌ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ని రిలీజ్ చేసింది మూవీ యూనిట్. లవ్ అండ్ కామెడీ, రొమాన్స్ కి సంబంధించిన సన్నివేశాలపై ఈ ట్రైలర్ ని కట్ చేసి విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో.. ” ఇన్ని ఇఎంఐలు ఉన్నవాడు ఏ అమ్మాయి గురించి ఆలోచించకూడదురా” అనే డైలాగ్ ట్రైలర్ లో హైలెట్ గా నిలిచింది. ఇక ఈ చిత్రాన్ని నవంబర్ 4వ తేదీన విడుదల చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news