దేశంలో సినిమా పండగకు గోవా పనాజీ వేదిక కానుంది. 52 వ ఇంటర్నేషనల్ ఫిలిం పెస్టివల్ ఆఫ్ ఇండియా(IFFI) నేటి నుంచి ఈనెల 28 వరకు జరుగనున్నాయి. కరోనా పాండిమిక్ తర్వాత జరగుతున్న మొదటి సారిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని గోవా ప్రభుత్వం, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితి దృష్ట్యా మరియు అన్ని ప్రోటోకాల్‌లకు అనుగుణంగా ఉండేలా ఫిల్మ్ ఫెస్టివల్ ను హైబ్రిడ్ ఫార్మాట్‌లో నిర్వహించబడుతుంది.
1952లో స్థాపించబడిన IFFI ఆసియాలోని అత్యంత ముఖ్యమైన చలనచిత్రోత్సవాలలో ఒకటి. ప్రస్తుతం జరగుతున్న 52వ IFFI లో ప్రపంచంలో 95 దేశాల నుంచి 624 చిత్రాలను ఈ కార్యక్రమంలో ప్రదర్శించబడుతాయి. ప్రపంచంతో వివిధ సీని పరిశ్రమల మధ్య ఆలోచనలు పంచుకోవడానికి ఈ ఇంటర్నేషనల్ ఫిలిం పెస్టివల్ వేదికగా నిలువనుంది.