నేటి నుంచి 12వ బ్రిక్స్‌ సమావేశాలు..భారత్‌పై ఒత్తిడి పెంచనున్న చైనా,రష్యా..!

-

కరోనా మమహ్మారితో ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ సంక్షోభంలో వెళ్లింది..దేశాలు ఆర్థికంగా చితికిపోయాయి..ప్రపంచ ఆర్ధిక శక్తుల మధ్య విభేదాలు క్రమంగా పెరుగుతున్నాయి.. క్రమంగా ఆర్థిక సంక్షోభం నుంచి కొలుకేనేందుకు ప్రపంచ దేశాల మధ్య ద్వైపాక్షిక ,రిజనల్ ఒప్పందాలు చేసుకుంటున్నాయి.. ఇటీవలే ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ కలిగిన దేశాలు ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం(RCEP) సంతకాలు చేశాయి.. దాదాపు 40 శాతం మార్కెట్, ప్రపంచంలో 30శాతం జనాభా ఈ కూటమిలో ఉన్నాయి.

తాజాగా ఈ రోజు నుంచి మరో కూటమి సమావేశాలు జరగనున్నాయి.. బ్రిక్స్ కూటమి శిఖరాగ్ర సమావేశాల ప్రారంభం కానున్నాయి.. ఈ సారి ప్రధానంగా ‘గ్లోబల్ స్టెబిలిటీ, షేర్డ్ సెక్యూరిటీ, ఇన్నోవేటివ్ గ్రోత్’ అనే అంశంపై రష్యా నిర్వహిస్తున్న 12 వ బ్రిక్స్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్నారు..

బ్రెజిల్-రష్యా-ఇండియా-చైనా-దక్షిణాఫ్రికా (బ్రిక్స్) శిఖరాగ్ర సమావేశానికి చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హాజరుకానున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈసారి మీటింగ్ వర్చవల్ విధానంలో జరగుంది.. ఉగ్రవాద నిరోధకత, వాణిజ్యం, ఆరోగ్యం, ఇంధనం మరియు కరోనావైరస్ మహమ్మారి ప్రభావాన్ని తగ్గించే మార్గాలపై సహకారంపై బ్రిక్స్‌ కూటమి దృష్టి సారించే అంశాలపై చర్చించనున్నారు.. సరిహద్దు వివాదం నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో మరోసారి ప్రధాని మోడీ వేదికను పంచుకోనున్నారు.. నవంబర్ 10 న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) శిఖరాగ్ర సమావేశంలో ఇరువురు నాయకులు వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు..ఎస్సీఓలోని అన్ని సభ్య దేశాలు ఒకరినొకరు గౌరవించాలని మోడీ చెప్పారు. సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడాలన్నారు.

బ్రిక్స్‌ దేశాల్లో దాదాపుగా 3.6 బిలియన్లకు పైగా జనాభా ఉన్నారు.. ప్రపంచ జనాభాలో సగం మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ కూటమిని ప్రభావవంతమైన కూటమిగా పిలుస్తారు.. బ్రిక్స్ దేశాలు కలిపి జిడిపి 16.6 ట్రిలియన్ డాలర్లు ఉంటుంది.. త్వరలో బ్రిక్స్ కూటమికి భారతదేశం అధ్యక్షత వహించనుంది.. ఇది ప్రారంభమైనప్పటి నుండి 2012 మరియు 2016 తరువాత భారతదేశానికి మూడవ బ్రిక్స్ ప్రెసిడెన్సీగా బాధ్యతలు చెపట్టింది.. 2021 లో 13 వ బ్రిక్స్ సదస్సును నిర్వహిస్తుంది” అని భారత విదేశాంగా శాఖ తెలిపింది.

ఈ భేటీలో RCEP ఒప్పందంపై భారత్‌పై ఒత్తిడి మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి..ఇప్పటికే కూటమిలో సంతకం చేసిన దేశాలు భారత్‌పై RCEPలో చేరాలని బ్రిక్స్‌ వేదిక నుంచి ఒత్తిడి తెచ్చే ప్రమాదం లేకపోలేదు.. గత చర్చల్లో అమోదించిన అంశాలపై కూడా మరోసారి చర్చకు వచ్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.. ముఖ్యంగా బ్రిక్స్‌ బ్యాంక్‌ (న్యూ డెవలప్ మెంట్ బ్యాంకు)పై మరోసారి చర్చకు రానుంది..గత చర్చలు అనతంరం లాంఛనప్రాయంగా ఉనికిలోకి వచ్చింది..బ్రిక్స్ కూటమి సభ్య దేశాలు తమదైన అభివృద్ధి బ్యాంకును విజయవంతంగా ఏర్పాటు చేశాయి..బ్రిక్స్ కూటమి ఆవిర్భావం నుండి పశ్చిమ రాజ్యాల కార్పొరేట్ పత్రికలు, విశ్లేషకులు బ్రిక్స్ కూటమిని అప్రతిష్టపాలు చేయడానికి అనేక ప్రయత్నాలు చేశారు. సభ్య దేశాల మధ్య విభేదాలు ఉన్నాయని ఒకరంటే ఒకరికి పడదని వార్తలు రాశాయి. చైనా ఆధిపత్యం వహిస్తుందేమోనని ఇతర సభ్య దేశాలకు తీవ్ర భయసందేహాలున్నాయని అందువల్ల కూటమి విఫలం కాక తప్పదని విశ్లేషించారు..

కూటమి ఏర్పాటై ఒకటిన్నర దశాబ్దం గడిచినా సాధించిందేమీ లేదని గేలి చేశారు. ఈ విమర్శలను, వెక్కిరింపులను పూర్వపక్షం చేస్తూ ఐదు వర్ధమాన దేశాధినేతలు నూతన అభివృద్ధి బ్యాంకును ప్రకటించారు. ‘బ్రిక్స్ డెవలప్ మెంట్ బ్యాంకు’ గా గతంలో ప్రకటించిన పేరును ‘న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్’ గా మార్చాలని సభ్య దేశాలు నిర్ణయించాయి. ఇండియా సూచన మేరకే ఈ పేరు మార్పు జరగడం గమనార్హం..ప్రపంచ ఆర్ధిక రంగంలో సరికొత్త శక్తిగా అవతరించిన బ్రిక్స్ కూటమి అభివృద్ధి బ్యాంకుతో పాటు ద్రవ్య సంస్ధకు కూడా రూపకల్పన చేసింది..నూతన అభివృద్ధి బ్యాంకు ఐ.ఎం.ఎఫ్ కు పోటీ అని అంతర్జాతీయ విశ్లేషకుల నిశ్చితాభిప్రాయం.

ఏ దేశ ఆర్ధిక వ్యవస్ధకైనా మౌలిక నిర్మాణ రంగం అత్యంత కీలకం. భారత దేశంలో ఈ రంగం బలహీనంగా ఉంది..కరోనా నేఫథ్యంలో ఇది మరింత సంక్షోభం ఎదుర్కొంటుంది.. ఈ రంగం కోసమే గత ప్రభుత్వం ఇన్ ఫ్రా స్ట్రక్చర్ బాండ్ల పేరుతో ప్రత్యేకంగా నిధులు సేకరించడానికి ప్రయత్నించింది. మౌలిక రంగంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి కేంద్రంలోని ప్రభుత్వాలు పలు ప్రయత్నాలు చేసి విఫలం అయ్యాయి. తక్షణ లాభాలు, వేగవంతమైన లాభాలు వచ్చే స్టాక్ మార్కెట్ లాంటి ద్రవ్య మార్కెట్లు మాత్రమే విదేశీ పెట్టుబడులకు ఆకర్షణీయంగా ఉంటాయి తప్ప దేశ అవసరాలను తీర్చే రంగాలు కాదని ఇన్నేళ్ల అనుభవం చెబుతున్న సత్యం.. ప్రపంచ బ్యాంకు వద్ద రుణాలు తీసుకుంటేనేమో అది విధించే విషమ షరతుల వల్ల దశాబ్దాల తరబడి మనం నిర్మించుకున్న వ్యవస్ధలు విదేశీ కంపెనీలపరం అయ్యే దుస్ధితి దాపురిస్తోంది.

చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదం..అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌ ఓటమి బ్రిక్స్‌ కూటమిలో కీలక చర్చ జరగుంది..అందుకు భారత్‌పై ఎక్కువ ఓత్తిడి ఉంటే అవకాశాలు లేకపోలేదు..ఇన్ని రోజులు అమెరికాతో నడిచిన భారత్‌ ఇప్పుడు మారిన రాజకీయ పరిణామాలతో ఇండియా పరిస్థితి మింగలేక చచ్చినట్లు ఉంది..బ్రిక్స్‌ కూటమిలో ఉన్న అగ్ర దేశాలు RCEP కూటమిలో ఉన్నాయి..దీంతో మనం ఆ కూటమిలో చేరకున్న వాటి వాణిజ్య నిర్ణయాలకు తల వంచకతప్పక పోవచ్చు అంటున్నారు రాజకీయ నిపుణులు..అవి విధించే పన్నులకు భారత్ అంగీకరించక తప్పదంటున్నారు..ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న బ్రిక్స్ కూటమి తీసుకునే నిర్ణయాలపై పశ్చిమ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి..

Read more RELATED
Recommended to you

Latest news