తీవ్ర‌త‌ర‌మ‌వుతున్న నిరుద్యోగ స‌మ‌స్య‌.. చ‌రిత్ర‌లో ఎన్న‌డూ ఇలా లేదు..

-

కరోనా మహమ్మారి రోజు రోజుకీ విజృంభిస్తున్న‌ నేపథ్యంలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఇక అమెరికాలో అయితే నిరుద్యోగ స‌మ‌స్య మ‌రీ ఎక్కువ‌గా ఉంది. జూన్‌ నెల మధ్య‌ నుండి గత వారం రోజుల కింద‌టి వరకు అక్క‌డ‌ 2.44 మిలియన్ల మంది నిరుద్యోగలు తమ అవసరాల కోసం నిరుద్యోగ భృతికి అప్లై చేసుకున్నారు. ఇక ఈ వారం రోజుల్లోనే కొత్త‌గా మరో 1.3 మిలియన్ల మంది నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసుకున్నారు.

america facing historical unemployment problem

అమెరికా లేబ‌ర్‌ డిపార్ట్‌మెంట్ గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతుండ‌డం, లాకౌడౌన్‌ నేపథ్యంలో 1.3 మిలియన్ల మంది కొత్తగా నిరుద్యోగ భృతి కోసం ద‌ర‌ఖాస్తులు చేశారు. కరోనా ప్రభావం మొదలైన నాటి నుండి నిరుద్యోగుల సంఖ్య అక్క‌డ గ‌ణ‌నీయంగా పెరుగుతూ వస్తోంది. ప్రతి వారం 1 మిలియన్‌కి పైగా ఉద్యోగులు త‌మ ఉద్యోగాల‌ను కోల్పోతున్నారు. ఈ క్ర‌మంలో అక్క‌డ నిరుద్యోగుల‌ ప‌రిస్థితి ఎలా ఉందో మ‌నం ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు. ఇక చాలా మంది ఉద్యోగాల‌ను కోల్పోతుండ‌డంతో అక్క‌డ ప‌రిశ్ర‌మ‌ల్లోనూ ఉత్ప‌త్తి తగ్గుతోంది. ఇది ఆ దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై తీవ్ర ప్ర‌భావం చూపిస్తోంది.

క‌రోనా మ‌హ‌మ్మారి అమెరికాలో వ్యాప్తి చెంద‌డం మొద‌లైన‌ప్ప‌టి నుంచి అక్క‌డ నిరుద్యోగ భృతి కోసం ద‌ర‌ఖాస్తు చేసుకుంటున్న వారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. ప్రారంభంలో నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తులు తక్కువగా ఉన్నా, గత మూడు వారాలుగా వాటి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. జూన్ మధ్యలో 2.24 మిలియ‌న్ల మంది నిరుద్యోగ భృతి కోసం ద‌ర‌ఖాస్తు చేయ‌గా గత వారం ఆ సంఖ్య‌ 2.44 మిలియ‌న్ల‌కు చేరుకుంది.

అయితే అమెరికాలో నిరుద్యోగుల సంఖ్య పెరుగుతుండ‌డం వ‌ల్ల ఆదేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై కూడా ఆ ప్ర‌భావం ప‌డుతోంది. చ‌రిత్ర‌లో నిజానికి ఇంత పెద్ద ఎత్తున అమెరికాలో ఎప్పుడూ నిరుద్యోగం పెర‌గ‌లేని నిపుణులు అంటున్నారు. మ‌రి ముందు ముందు ఏమ‌వుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news