గాల్లో ఉండగా విమానం ఇంజిన్​లో మంటలు.. వీడియో వైరల్

-

అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. గాల్లో ఉండగా విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. అసలేం జరిగిందంటే..?

అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 737 బోయింగ్‌ విమానం ఒహాయెలోని కొలంబస్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ (నుంచి ఫీనిక్స్‌కు బయల్దేరింది. టేకాఫ్‌ అయిన 25 నిమిషాలకే ఓ పక్షుల గుంపు విమానాన్ని ఢీ కొట్టింది. ఒక్కసారిగా పక్షులు ఢీ కొట్టడంతో విమానం కుడి వైపునున్న ఇంజిన్‌ నుంచి పొగలు వచ్చాయి. వెంటనే మంటలు చెలరేగాయి. ఇది గమనించిన పైలట్ అప్రమత్తయ్యారు.

వెంటనే విమానాన్ని కొలంబస్‌ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్‌ చేసినట్లు ఎయిర్‌పోర్ట్‌ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానం కొలంబస్‌ ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్‌ అయిన తర్వాత అందులోని ప్రయాణికులను మరో విమానంలో అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news