అమెరికా ప్రభుత్వంలో మరో భారత సంతతి మహిళకి కీలక పదవి

-

భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్, అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ విషయంతో భారత్ లోని ఆమె అభిమానులు చాలా ఉప్పొంగిపోయారు. తాజాగా అమెరికా ప్రభుత్వంలో మరో భారత సంతతి మహిళకి కీలక బాధ్యతలు దక్కినట్లి సమాచారం. జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న ప్రభుత్వంలో భారత సంతతి వారికి కీలక పదవులు అందుతున్నాయి. ప్రస్తుతం బీడీషా భట్టాచార్య అనే మహిళకి వ్యవసాయ శాఖలో ముఖ్యమైన పదవి దక్కింది.

బీడీషా భట్టాచార్య అంతకుముందు సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రస్ లో వాతావరణ విద్యుత్ పాలసీ డైరెక్టర్ గా పని చేశారు. ఆర్థిక శాస్త్రంలో బ్యాచులర్ డిగ్రీని పూర్తి చేసిన బిడీషా అనేక కంపెనీల్లో పని చేసారు. సింపా నెట్ వర్క్స్ అనే స్టార్టప్ మొదలు పెట్టి అందులో మూడేళ్ళ పాటు పని చేసారు. ప్రస్తుతం ఈ పదవి రావడం తనకెంటో ఆనందంగా ఉందని, తన పనిని సక్రమంగా నిర్వర్తిస్తానని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news