అయ్యో రామా.. మళ్లీ బైడెన్‌ తడబాటు.. తలపట్టుకున్న డెమోక్రాట్లు

-

అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ డెమోక్రాట్లలో టెన్షన్‌ పెరిగిపోతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జోబైడెన్‌ వ్యవహార శైలితో తమ గెలుపు ప్రమాదంలో పడిపోతోందని ఆందోళన ఎక్కువవుతోంది. బైడెన్  ప్రసంగంలో తడబాట్లతో నవ్వుల పాలవుతున్నామనే భయం వారిని పీడిస్తోంది. ఇప్పటికే పలుమార్లు బైడెన్ తన ప్రసంగంతో విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

తాజాగా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై దాడి నేపథ్యంలో ఆయన జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలోనూ  ఆయన తప్పులు మాట్లాడారు. ‘తమ విబేధాలను బ్యాలెట్‌ బాక్సుల్లో పరిష్కరించుకొంటాం’ అని చెప్పాల్సి ఉండగా.. ‘బ్యాటిల్‌ బాక్సుల్లో’ (యుద్ధపు పెట్టెల్లో) పరిష్కరించుకొంటామని వ్యాఖ్యానించారు. బైడెన్‌ మాట్లాడుతూ.. ‘‘అమెరికాలో మా విభేదాల పరిష్కారానికి బ్యాటిల్‌ బాక్సును నమ్ముతాం. ఇప్పుడు కూడా మేం వాటిని బ్యాటిల్‌ బాక్సుల్లోనే పరిష్కరించుకొంటాం.. బుల్లెట్లతో కాదు’’ అని చెప్పడంతో సహాయకులు తలలు పట్టుకొన్నారు. అక్కడ ఆయన బ్యాలెట్‌ బాక్సులు అని పలకాల్సి ఉంది. ఇప్పటికే బైడెన్ వ్యవహార శైలి వల్ల డెమోక్రాట్ విజయావకశాలు తగ్గుతున్నాయని, ఆయన పోటీ నుంచి తప్పుకోవాలని డెమోక్రాట్ నేతలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news