అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు రోజురోజుకు వ్యతిరేకత ఎక్కువవుతోంది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి ఆయన అనర్హుడంటూ సొంత పార్టీలో ముసలం మొదలైంది. ఇక మాజీ అధ్యక్షుడు, రిపబ్లిక్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్తో డిబేట్ తర్వాత బైడెన్పై విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో ఆయన మరోసారి తప్పులో కాలేశారు. అమెరికా ఉపాధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు పుతిన్ అంటూ ఆయన మరోసారి పొరబాటు వ్యాఖ్యలు చేశారు.
రెండోసారి అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన బైడెన్‌పై ఇంటాబయట తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో ఆయనపై వ్యతిరేకత మరింత ఎక్కువవుతోంది. నాటో దేశాల వార్షిక సదస్సు తర్వాత బైడెన్ మీడియాతో మాట్లాడూతు.. ఈ సందర్భంగా అధ్యక్ష రేసు నుంచి మీరు వైదొలగితే కమలా హ్యారిస్…ట్రంప్‌ను ఓడించగలరని భావిస్తున్నారా..? అని పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు .. అధ్యక్షుడిగా పనిచేసే అర్హత ఉపాధ్యక్షుడు ట్రంప్‌నకు లేకుంటే.. ఆయన్ని ఆ పదవికి ఎంపిక చేసేవాణ్నే కాదన్నారు. ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్‌కు బదులు…ట్రంప్ అని అన్నారు. మీడియా సమావేశానికి ముందు నాటో సభ్యదేశాల ప్రతినిధులకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని పరిచయం చేసిన బైడెన్…ఆ సమయంలో జెలెన్‌స్కీని ఆహ్వానిస్తూ అధ్యక్షుడు పుతిన్ అని సంబోధించారు.