భారత్, చైనా వంటి దేశాలు అత్యధిక జనాభాతో ఇబ్బందులు ఎదుర్కొంటే ఉత్తర కొరియా, దక్షిణ కొరియా దేశాలు మాత్రం ఎక్కువ మంది పిల్లలను కనాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ కొరియాలో యువత పిల్లలను కనడానికి సిద్ధంగా లేరట. పిల్లల్ని కంటే వారి కోసం కెరీర్ను వదులుకోవాల్సి వస్తుందని భావిస్తున్నారట. మరోవైపు వాళ్లను పెంచేందుకు అయ్యే ఖర్చులు కూడా ఓ కారణమట. అందుకే దక్షిణ కొరియాకు చెందిన సంస్థ బూయాంగ్ గ్రూప్ తమ ఉద్యోగులకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది.
పిల్లలను కంటే తమ సిబ్బందికి ఏకంగా రూ.62 లక్షల నగదు (కొరియా కరెన్సీలో వంద మిలియన్ వన్లు) బోనస్‌గా చెల్లిస్తానని బూయాంగ్ సంస్థ ప్రకటించింది. ఎంత మంది పిల్లల్ని కంటే అన్నిసార్లూ ఇంత మొత్తం ఇస్తామని తెలిపింది. ఎందుకలా అంటే- ఆ దేశంలో సంతాన సాఫల్యత రేటు (0.72) బాగా పడిపోయింది. ఇది ఇలాగే కొనసాగితే ఈ శతాబ్దం చివరికల్లా దేశ జనాభా సగానికి తగ్గిపోతుందని భావించి పలు కంపెనీలు ఒకదానితో ఒకటి పోటీపడి మరీ పిల్లల్ని కనే ఉద్యోగులకు బోనస్‌లు ప్రకటిస్తున్నాయి.