Cm jagan: సీఎం జగన్పై దాడి జరిపింది స్కూల్ బిల్డింగులో నుంచేనని పోలీసులు గుర్తించారు. స్కూల్ బిల్డింగ్ నుంచే దాడి జరిగిందని ప్రాథమిక నిర్థారణకు వచ్చారు విజయవాడ పోలీసులు. ఈ ఘటన జరిగిన సమీప ప్రాంతంలో సీసీ కెమెరా ఫుటేజ్ పై పోలీసులు ఆరా తీస్తున్నారు. స్కూల్లో అడుగడడుగునా సీసీ కెమెరాలు ఉన్నాయి.

రెండు అంతస్థుల స్కూల్ భవనంలో కారిడార్లు, స్టెయిర్స్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది స్కూల్ యాజమాన్యం. ఇక నిన్ననే స్కూల్ బిల్డింగ్ వచ్చి పరిశీలించిన విజయవాడ సీపీ కాంతి రాణా తాతా…స్కూల్ బిల్డింగ్ నుంచే దాడి జరిగిందని ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.