ప్రపంచ వ్యాప్తంగా పట్టణాల్లోని ప్రయాణీకులని ఒక చోటి నుండి మరో చోటికి తీసుకెళ్ళే క్యాబ్ సర్వీసు ఉబర్ కి బ్రిటన్ కోర్టులో గట్టి దెబ్బ పడింది. క్యాబ్ సేవలనందిస్తున్న ఉబర్ లో పనిచేసే డ్రైవర్లని కార్మికులుగానే గుర్తించాలని లండన్ లోని ఓ కోర్టు తీర్పునిచ్చింది. కార్మికుల మాదిరిగానే జీతాలు, సేవలు, ఆరోగ్యం మొదలగు వాటిల్లో సకల సదుపాయాలు కల్పించాలని లండన్ లోని కోర్టు అభిప్రాయపడింది. కనీస వేతనం, సెలవులు మొదలగు వాటిల్లో వారికి లోటు రాకూడదని, వారు కూడా కార్మికులే అని తెలిపింది.
ఈ తీర్పు రాకముందు ఉబర్ లో పనిచేసే డ్రైవర్లందరూ థర్ట్ పార్టీ కాంట్రాక్టర్లుగా గుర్తించబడేవారు. అందువల్ల వారికి కార్మికులకి అందాల్సిన అనేక అవసరాలు అందకపోయేవి. కానీ ఇప్పుడు కోర్టు నుండి తీర్పు రావడంతో వారు కార్మికులుగానే పరిగణీంచబడతారు. మరి ఇలాంటి నియమాలు ఇండియాకి కూడా వస్తే బానే ఉంటుందేమో!