బైబై ట్రంప్: నువ్వు చిన్నపిల్లాడివి ట్రంప్, నెటిజన్ల సెటైర్లు…!

-

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎలా అయినా మాట మార్చేస్తారు. ఆయనకు అనుకూలంగా ఉంటే ఒకలా ఆయనకు అనుకూలంగా లేకపోతే ఒకలా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తనకు ఫలితం ఇబ్బందికరంగా రావడం, అధికారం కోల్పోయే విధంగా చేయడంతో ఎన్నికలు ఫ్రాడ్ అంటూ ఆ దేశ ఎన్నికల వ్యవస్థను ఆయన టార్గెట్ చేసారు. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో కామెంట్స్ ఆసక్తికరంగా చేస్తున్నారు.

బైబై ట్రంప్… నువ్వు చిన్నపిల్లాడివి ట్రంప్… ఇది ఇబ్బందికరంగా ఉంది… ప్రజాస్వామ్యం మనకోసం ఎలా పని చేస్తుంది… నిజంగా ట్రంప్ సూపర్ మార్కెట్లో ఒక చిన్న పిల్లవాడిని అని మాకు తెలుసు అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఎన్నికల ఫలితాల్లో ఇప్పుడు దాదాపుగా ట్రంప్ ఒడినట్టే కనపడుతుంది. నేడు ఫలితాలపై స్పష్టత వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news