43 మిలియన్లు దాటిన కరోనా కేసులు…!

మొత్తం ప్రపంచంలో కరోనా వైరస్ కేసులు 43 మిలియన్ల మార్కుకు చేరుకోగా, మరణాలు 1,152,770కు పైగా నమోదు అయ్యాయి అని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తెలిపింది. సోమవారం ఉదయం నాటికి మొత్తం కేసుల సంఖ్య 4 కోట్ల 29 లక్షల 18 వేల 008 కాగా, మరణాల సంఖ్య 11 లక్షల 52 వేల 773 కు చేరుకుందని యూనివర్శిటీ సెంటర్ ఫర్ సిస్టమ్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సిఎస్‌ఎస్‌ఇ) తన తాజా ప్రకటనలో ప్రకటించింది.

సిఎస్‌ఎస్‌ఈ నివేదిక ప్రకారం… ప్రపంచంలోనే అత్యధికంగా 86 లక్షల 33 వేల 194 కేసులు 2 లక్షల 25 వేల 215 మరణాలు సంభవించిన దేశం అమెరికా. కేసుల పరంగా భారత్ రెండవ స్థానంలో 7,864,811 ఉండగా, మరణాల సంఖ్య 118,534 కు చేరుకుంది. బ్రెజిల్ (5,380,635), రష్యా (1,503,652), ఫ్రాన్స్ (1,503,652), అర్జెంటీనా (1,090,589), స్పెయిన్ (1,046,132), కొలంబియా (1,015,885), మెక్సికో (891,160), పెరూ (886,214) ), యుకె (876,840), దక్షిణాఫ్రికా (715,868), ఇరాన్ (568,896), ఇటలీ (525,782), చిలీ (502,063), ఇరాక్ (451,707) మరియు జర్మనీ (4, 37,698) అని సిఎస్‌ఎస్ఈ గణాంకాలు వెల్లడించాయి.