కోవిడ్ ఆంక్షలు ఎత్తేసిన మొదటి యూరప్ దేశం ఇదే.. ఏ విధంగా సాధించిందంటే?

కోవిడ్ ఆంక్షలు ఎత్తివేసిన మొదటి యూరప్ దేశంగా డెన్మార్క్ నిలిచింది. కరోనా కేసులు పూర్తిగా తగ్గడంతో పాటు దాదాపు 70శాతం ప్రజలకు వ్యాక్సినేషన్ పూర్తికావడమే దీనికి కారణం. . ప్రస్తుతానికి కోవిడ్ వ్యాప్తి అదుపులోనే ఉందని అక్కడి అధికార్లు తెలియజేసారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై అక్కడి ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇకపై ఎక్కడికి వెళ్ళాలన్నా ఎలాంటి సర్టిఫికేట్లు గానీ ఇతర ఆంక్షలు గానీ ఉండవు. కొన్ని రోజులుగా ఒక్కొక్కట్టిగా నిబంధనలు సడలిస్తూ వస్తున్న డెన్మార్క్, ఇప్పుడు పూర్తిగా తొలగించింది.

2021మార్చి నుండి కోవిడ్ ఆంక్షలను ఒక్కొక్కటిగా ఎత్తివేస్తూ వస్తుంది. ఆగస్టులోనే మాస్కుల అవసరం లేదని తెలిపిన ఇకపై ఎలాంటి నిబంధనలను పెట్టట్లేదు. ఈ దెబ్బతో యూరోపియన్ దేశాల్లో కరోనా ఆంక్షలను ఎత్తివేసిన మొదటి దేశంగా డెన్మార్క్ నిలిచింది. సాధారణ పరిస్థితులను మళ్ళీ చూడడానికి అసాధారణ కష్టాలు పడ్డ ప్రజలు చివరికి సాధారణ పరిస్థితులను సాధించుకున్నారు.