ఈ మధ్య కాలంలో గుండె జబ్బులు అధికంగా పెరుగుతున్నాయి అవి పెరగడానికి అనేక కారణాలున్నాయి. అయితే ముఖ్యంగా జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లు ప్రభావం చూపుతున్నాయి. గుండె జబ్బులు దరిచేరకుండా ఎంతో ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక వ్యాయామాలు చేస్తే సరిపోదు, ఎప్పుడైతే సమతుల్యమైన ఆహారాన్ని తీసుకుంటారో అప్పుడు గుండెజబ్బులు నుండే కాకుండా అనేక వ్యాధుల నుండి మీకు రక్షణ కలుగుతుంది. ఎటువంటి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలో తెలుసుకోవాలంటే ఎలాంటి ఆలస్యం లేకుండా ఇప్పుడే దీనిని పూర్తిగా చూసేయండి.
మీ రోజువారి ఆహారంలో తృణధాన్యాలు తప్పకుండా ఉండేటట్టుగా చూసుకోండి. తృణధాన్యాలలో అధికంగా ఫైబర్ ఉంటుంది. దాంతో పాటు విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఐరన్ ఎక్కువగా ఉంటాయి. కనుక ఈ తృణధాన్యాలను ఏదో ఒక రకంగా రోజు వారి ఆహారంలో తీసుకోండి.
అలానే పెరుగులో ప్రోబయోటిక్స్ అత్యధికంగా ఉంటాయి. మన శరీరం ప్రోబయోటిక్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మంచి బ్యాక్టీరియా అనేది పెరిగి రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. చాలామంది పెరుగును శీతాకాలంలో తీసుకోవడం మానేస్తుంటారు. అలా కాకుండా ప్రతిరోజు పెరుగును తీసుకోండి, దీనివల్ల కూడా మీ గుండె ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది. అదే విధంగా సోయా గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సోయాలో అత్యధిక శాతం ఫైబర్, విటమిన్స్ మరియు మినిరల్స్ ఉంటాయి. ప్రతిరోజు ఆహారంలో సోయాను తీసుకోవడం వలన శరీరంలో కొలెస్ట్రాల్ శాతం సరైన విధంగా ఉండేలా చేస్తుంది. దాంతోపాటు రక్తపోటును అదుపు చేస్తుంది.