కరోనా భయంతో 17 మిలియన్ల జంతువులను చంపేస్తున్నా దేశం…!

-

జంతువులలో కనిపించే కరోనా వైరస్ ప్రజలకు కూడా సోకుతుంది అని భావించిన డెన్మార్క్ తన దేశంలో మింక్ అనే ఒక జంతువులను పూర్తిగా చంపాలి అని నిర్ణయం తీసుకుంది. 17 మిలియన్ల జంతువులను చంపాలి అని నిర్ణయం తీసుకుంది. దీనిపై ఆ దేశ ప్రధాన మంత్రి మెట్టే ఫ్రెడెరిక్సెన్ మాట్లాడుతూ ఆరోగ్య శాఖ అధికారులు మానవులలో మరియు మింక్‌ లో కరోనా వైరస్ జాతులను కనుగొన్నారు అని చెప్పారు.

ఇవి భవిష్యత్తులో రాబోయే టీకాలలో యాంటీ బాడీస్‌ పై సున్నితత్వాన్ని, సమర్థతను తగ్గిస్తుంది అని చెప్పారు. మా ప్రజల విషయంలో మాకు బాధ్యత ఉంది. ఇప్పటి వరకు మేము గమనించిన దాని ప్రకారం చూస్తే అవి ప్రమాదకరం అని ఆయన పేర్కొన్నారు. డెన్మార్క్… యూరప్ లో మింక్ బొచ్చుని భారీగా ఎగుమతి చేస్తుంది. దేశంలో 15 మిలియన్ల నుంచి 17 మిలియన్ల మింక్ లు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news