నేనసలు చనిపోయాననుకున్నా.. మళ్లీ మీ ముందుకు వస్తాననుకోలేదు: ట్రంప్

-

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మృత్యువు నుంచి తృటిలో తప్పించుకున్న విషయం తెలిసిందే. దీనిగురించి తాజాగా ట్రంప్ అమెరికన్ వార్తా సంస్థతో మాట్లాడారు. ఆ దాడిలో తాను చనిపోయాననే అనుకున్నానని వ్యాఖ్యానించారు. అసలు తాను ప్రజల ముందు ఇలా ఉండేవాడినే కాదని.. కాల్పుల ఘటనలో చనిపోయాననే అనుకున్నానని.. ఇదొక చిత్రమైన పరిస్థితి అని ట్రంప్ అన్నట్లు  మీడియా సంస్థ వెల్లడించింది.

ఆ సమయంలో ఆయన చెవికి బ్యాండేజ్ ఉన్నట్లు పేర్కొంది. రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌లో పాల్గొనేందుకు విమానంలో ప్రయాణిస్తూ మాజీ అధ్యక్షుడు ఈ విధంగా స్పందించారు.  ఇలాంటి చర్య అమెరికాలో జరగడం నమ్మశక్యంగా లేదని.. కాల్పుల శబ్దాలు వినగానే ఏదో జరుగుతోందని అర్థమైందని తెలిపారు.

మరోవైపు ఈ ఘటన తర్వాత అధ్యక్ష రేసు ఏకపక్షమవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తూటా తాకిన వెంటనే కిందకు వంగి.. తర్వాత పిడికిలి బిగించి బలంగా పైకి లేచిన ట్రంప్‌ తీరు పలువురిని ఆకట్టుకొంది.  ‘అమెరికాకు కావాల్సింది ఇలాంటి యోధుడే’ అంటూ రిపబ్లికన్లు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news