ఇలా చేయండి.. రష్యా, చైనా యుద్ధం కొట్టుకుచస్తాయి. మనం చూడోచ్చు: డొనాల్డ్ ట్రంప్ ఫన్నీ కామెంట్స్

-

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రూటే సపరేటు. తన ‘ట్రంపరితనం’ నిత్యం ఏదో వ్యాఖ్యలు చేస్తూ వివాదాల్లో ఉంటాడు. ఇలా అధ్యక్ష పదవిలో ఉండీ కూడా పలుమార్లు సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా మరోసారి ఇలాంటి ఫన్నీ వ్యాఖ్యలు చేశాడు. ఈసారి రష్యా, చైనా గురించి మాట్లాడారు. అమెరికాకు చెందిన ఎఫ్-22 విమానాలకు చైనా జెండాలు పెట్టుకుని రష్యాపై బాంబులు వేయాలని ట్రంప్ అన్నారు. దీంతో చైనానే దాడి చేసిందని చెప్పాలని.. దీంతో చైనా, రష్యాలు యుద్ధం చేస్తే మనం కూర్చొని చూడొచ్చని ఫన్నీ కామెంట్స్ చేశాడు. నాటో కేవలం కాగితం పులి మాత్రమే అని అభివర్ణించారు. రిపబ్లిక్ జాతీయ కమిటీ మీటింగ్ లో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలపై అధికార డెమొక్రాట్లు విమర్శలు చేస్తున్నారు. 

ఇటీవల ఉక్రెయిన్, రష్యా యుద్ధానికి అమెరికానే కారణం అంటూ.. వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ తరువాత టార్గెట్ అయ్యేది తైవానే అని.. చైనా ఎప్పటి నుంచో తైవాన్ ను స్వాధీనం చేసుకోవాలని చూస్తుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా నాయకుల చేతకానితనం వల్లే మర్యాద లేకుండా పోతుందని వ్యాఖ్యానించాడు.

Read more RELATED
Recommended to you

Latest news