సోషల్ మీడియా నియంత్రణ.. బైడెన్ సర్కార్ ప్రయత్నానికి ఫెడరల్‌ జడ్జి బ్రేక్

-

అమెరికా సర్కార్ కు అక్కడి ఫెడరల్ జడ్జి షాక్ ఇచ్చారు. సోషల్‌ మీడియాలో కంటెంట్‌ను నియంత్రించే అంశంపై చర్చించేందుకు అమెరికా ప్రభుత్వం చేస్తున్న యత్నాలకు బ్రేకులు వేశారు. జో బైడెన్‌ కార్యవర్గం సభ్యులు, ఏజెన్సీలు ఈ అంశంపై సామాజిక మాధ్యమ కంపెనీల ప్రతినిధులతో భేటీ కాకుండా చూడాలని లూసియాన, మిస్సోరిలోని రిపబ్లికన్‌ అటార్నీ జనరల్‌ న్యాయస్థాన్నాన్ని ఆశ్రయించారు. దీనికి స్పందిస్తూ ఫెడరల్‌ న్యాయమూర్తి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఎఫ్‌బీఐ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ హ్యూమన్‌ సర్వీసెస్‌  వంటి ఏజెన్సీలు సామాజిక మాధ్యమ కంపెనీలతో కొన్ని అంశాలపై మాట్లాడకూడదని న్యాయమూర్తి తన ఆదేశాల్లో పేర్కొన్నారు.

దీనిపై శ్వేతసౌధం ప్రతినిధి మాట్లాడుతూ.. జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌ ఈ ఆదేశాలను పరిశీలించడంతోపాటు.. ఇతర ఆప్షన్లను కూడా చూస్తోందని వెల్లడించారు. మరో వైపు ఈ ఆదేశాలతో రిపబ్లికన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను అణచివేయడానికి బైడెన్‌ సర్కారు కరోనావైరస్‌ మహమ్మారిని, తప్పుడు సమాచారం ముప్పును బూచిగా వాడుకుంటోందని ఆరోపించారు. మరోవైపు అమెరికా అధికారులు మాత్రం కొవిడ్‌ టీకాలపై తప్పుడు ప్రచారాన్ని అడ్డుకొని ప్రజల ప్రాణాలు కాపాడేందుకు యత్నిస్తున్నట్లు వెల్లడిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news