ఖుషీ సినిమా షూటింగ్‌ పూర్తి.. యాగం చేసిన టీమ్.. వీడియో వైరల్‌

-

లైగర్ ఫ్లాప్ లో ఉన్న విజయ్ దేవరకొండ.. శాకుంతలం అట్టర్ ఫ్లాప్ తో ఉన్న సమంత.. కలిసి నటిస్తున్న సినిమా ఖుషీ. ఈ ఇద్దరు ఖుషీ ద్వారా సక్సెస్ కొట్టాలని ప్రయత్నిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తయింది. తాజాగా షూటింగ్‌ స్పాట్‌ నుంచి ఓ స్పెషల్ వీడియోను కూడా రిలీజ్‌ చేశారు. కుటుంబసభ్యులంతా గుడిలో యాగం చేస్తున్నట్టు వీడియోలో చూపించారు. సమంత రెడ్ కలర్ చీర కట్టుకోగా.. విజయ్ షర్ట్, పంచ కట్టుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది.

కశ్మీర్‌ బ్యాక్‌గ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తుంది. ఇప్పటికే రిలీజైన నా రోజా నువ్వే సాంగ్ ఇన్‌స్టాంట్‌గా ఎక్కేసింది. మరో వారం, రెండు వారాల్లో సెకండ్ సింగిల్‌ను కూడా రిలీజ్‌ చేయబోతున్నట్లు టాక్‌.  ఈ సినిమా సెప్టెంబర్‌ 1న పాన్‌ ఇండియా లెవల్లో రిలీజ్‌ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news