BREAKING : జపాన్ మాజీ ప్రధాని దారుణ హత్య !

-

జపాన్ మాజీ ప్రధాని షింజో అబే పై నారా ప్రాంతంలో కాల్పులు జరిగినట్లు జపాన్ కు చెందిన ప్రముఖ వార్త సంస్థ పేర్కొంది. జపాన్ నగరంలోని ఓ వీధిలో ప్రసంగిస్తుండగా వెనుక నుంచి వచ్చిన ఓ దుండగులు ఆయనపై దాడి చేసినట్లు పేర్కొంది. దీంతో ఆయన ఒక్కసారిగా కుప్ప కూలిపోయారు.

ఈ సంఘటనలో ఆయన తీవ్రంగా గాయపడినట్లు… ఆసుపత్రికి తీసుకువెళ్లే లోపే ఆయన మరణించినట్లు సమాచారం అందుతుంది. నిందితుడిని శుక్రవారం.. అంటే ఇవాళ ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కొన్ని మీడియా సంస్థల్లో మాజీ ప్రధాని అభే మరణించినట్లు వార్తలు రాగా.. మరికొన్ని మీడియాల్లో ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు పేర్కొంటున్నాయి. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని క్షణాలు ఆడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news