ఫ్రాన్స్‌ నూతన ప్రధానిగా గాబ్రియేల్‌ అట్టల్‌.. అతిపిన్న వయస్కుడిగా రికార్డ్

-

ఫ్రాన్స్‌ నూతన ప్రధానిగా 34 ఏళ్ల గాబ్రియేల్‌ అట్టల్‌ నియమితులయ్యారు. ఆ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ గాబ్రియేల్ ను నియమించారు. ఆ దేశ చరిత్రలో అతిపిన్న వయస్కుడైన ప్రధానిగా అట్టల్‌ నిలిచారు. ఈ ఏడాది చివర్లో జరిగే యూరోపియన్‌ పార్లమెంటు ఎన్నికలకు ముందు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌ చేపట్టిన నూతన ప్రధాని నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది.

2020 నుంచి 2022 వరకు ప్రభుత్వ అధికార ప్రతినిధిగా పని చేసిన 34 ఏళ్ల గాబ్రియల్ అట్టల్ ఆ తర్వాత విద్యాశాఖ మంత్రిగా సేవలందించారు. అంతేగాక ఫ్రాన్స్​ ప్రధాన మంత్రి పదవి చేపట్టిన మెట్టమొదటి స్వలింగ సంపర్కుడు గాబ్రియల్ అట్టల్​ కావడం గమనార్హం.

ఇటీవల తెచ్చిన వివాదాస్పద ఇమ్మిగ్రేషన్ చట్టంపై రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఎలిజబెత్ బోర్న్ సోమవారం రాజీమామా చేశారు. దీనివల్ల అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ నూతన ప్రధానిగా గాబ్రియేల్‌ అట్టల్‌ను నియమించారు. కొత్త చట్టం ప్రకారం విదేశీయులను వెనక్కి పంపేందుకు ప్రభుత్వానికి మరిన్ని అధికారులు లభిస్తాయి. 2022లో ప్రధానిగా బోర్న్ బాధ్యతలు చేపట్టారు. 2024 జనవరి 8న పదవి నుంచి వైదొలిగారు.

Read more RELATED
Recommended to you

Latest news