హవాయిలో కార్చిచ్చు బీభత్సం.. 67కు చేరిన మృతుల సంఖ్య

-

అమెరికా భూభాగం హవాయి ద్వీప సమూహంలో చెలరేగిన కార్చిచ్చు రోజురోజుకు బీభత్సం సృష్టిస్తోంది. ఈ కార్చిచ్చు వల్ల ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. కార్చిచ్చు ధాటికి మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. గంటల వ్యవధిలోనే మృతుల సంఖ్య డజన్‌కు పైగా పెరిగి 67కు చేరిందని మావీయ్‌ ప్రభుత్వం ప్రకటించింది. దావానలాన్ని ఇంకా అదుపులోకి తేలేకపోయినట్లు తెలిపింది.

ఇప్పటి వరకు చనిపోయిన వారంతా దీవిని విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తూ గాయపడి మరణించిన వారేనని మావీయ్‌ గవర్నర్‌ చెప్పారు. కాగా హవాయిలో టెలీ కమ్యూనికేషన్‌, విద్యుత్‌ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో స్థానికులను హెచ్చరించడం తీవ్ర కష్టతరమవుతోందని ప్రభుత్వం తెలిపింది. కార్చిచ్చుపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌.. స్థానిక ప్రభుత్వానికి తక్షణ సాయం కింద మరిన్ని నిధులు విడుదల చేసేందుకు నిర్ణయించారు. కార్చిచ్చును అదుపు చేసేందుకు సైన్యం, వాయుసేనను బైడెన్‌ ఇప్పటికే రంగంలోకి దించారు. ఇప్పటికే కార్చిచ్చు ధాటికి వేల ఇండ్లు.. వాహనాలు కాలి బూడిదయ్యాయి. ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకుని భయంభయంగా జీవిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news