తెలంగాణ రాష్ట్ర ప్రయాణికులకు బిగ్ అలర్ఠ్. ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు టికెట్ ధర నేటి నుంచి రూ. 10 పెరగనుంది. ఈ పెంపుతో ప్రయాణికుడికి అర లీటర్ జీవా వాటర్ బాటిల్ అందించమన్నారు. ఇంతకాలం ఏసీ బస్సుల్లో ప్రయాణికులకు మంచినీటి సీసాలు అందించే పద్ధతి ఇప్పుడు సూపర్ లగ్జరీ బస్సులోను ప్రవేశపెడుతున్నారు.
ఈ నేపథ్యంలో దూరంతో ప్రమేయం లేకుండా టికెట్ ధరపై రూ.10 అదనంగా వసూలు చేయనున్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో దాదాపు 700 సూపర్ లగ్జరీ బస్సులు ఉన్నాయి. కాగా, హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో పుష్పక్ బస్సు ఎక్కినవారు నగరంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే సదుపాయాన్ని టీఎస్‌ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ అందుబాటులోకి తెచ్చింది. పుష్పక్ బస్సులో టిక్కెట్ కొన్న క్షణం నుంచి 3 గంటలపాటు ఈ ఉచిత ప్రయాణ సౌలభ్యాన్ని వినియోగించుకోవచ్చని అధికారులు చెప్పారు.