ప్రపంచ దేశాలను భయాందోళనకు గురి చేసిన కరోనా రక్కసి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో.. మంకీపాక్స్ రూపంలో మరో వైరస్ ప్రజలపై దాడి చేసేందుకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్న మంకీ పాక్స్ వైరస్ లో కూడా వేర్వేరు స్ట్రెయిన్లు వ్యాప్తిలో ఉన్నాయి.
![కరోనా వైరస్-మంకీపాక్స్](https://cdn.manalokam.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-24-at-9.55.29-AM.jpeg)
ఈ క్రమంలోనే యూరప్ లో విజృంభిస్తున్న స్ట్రెయిన్, ఇండియాలో బయటపడిన రకం వేర్వేరు అని భారత శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక ఈ మంకీ పాక్స్ వైరస్ అగ్ర రాజ్యం అమెరికాలో విజృంభిస్తోంది. మంకీపాక్స్ వ్యాప్తితో న్యూయార్క్‌లో హెల్త్ ఎమర్జెన్సీ విధించింది అమెరికా ప్రభుత్వం.
న్యూయార్క్‌లో ఇప్పటి వరకు 1,400 మంకీపాక్స్ కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలోనే న్యూయార్క్‌లో హెల్త్ ఎమర్జెన్సీ విధించారు. ఇది ఇలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కరోనా బారీన పడిన సంగతి తెలిసిందే.