ఆఫ్ఘనిస్తాన్: తాలిబన్లకు షాకిచ్చిన ఐఎంఫ్.. నిధులు తీసుకోవడానికి నిరాకరణ.

-

ఆఫ్ఘనిస్తాన్ దేశం తాలిబన్ల వశమైంది. అష్రాఫ్ ఘని ప్రభుత్వాన్ని పడగొట్టిన తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆఫ్ఘన్ ప్రజలో చాలా భయాందోళనలు కలుగుతున్నాయి. అటు ప్రపంచ వ్యాప్తంగా ఆఫ్ఘన్ పరిస్థితి గురించి ఒకరకమైన గందరగోళం నెలకొంది. స్పష్టమైన ప్రభుత్వం లేకపోవడంతో అనేక ఇబ్బందులు తలెత్తుతాయన్న వాదన ఉంది. ఆ వాదనను నిజం చేసేలా, ప్రస్తుతం అంతర్జాతీయ ద్రవ్య నిధి, తాలిబన్లకు షాకిచ్చింది.

ఆఫ్ఘనిస్తాన్ కు నిధులు ఇవ్వబోమని, ఇదివరకు కేటాయించిన నిధులను కూడా మంజూరు చేసే అవకాశం లేదని, ప్రభుత్వ ఏర్పాటులో స్పష్టత కొరవడిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని ఐఎంఎఫ్ ప్రకటించింది. ప్రస్తుతం నిధులు నిలిపివేసింది. మొత్తానికి ఆఫ్ఘనిస్తాన్ దేశానికి మరిన్ని చిక్కులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరి దీనిపై తాలిబన్లు ఎలా స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news