ఇజ్రాయెల్‌కు 6,000 మంది భారత కార్మికులు!

-

హమాస్‌తో ఘర్షణల వల్ల ఇజ్రాయెల్లో నిర్మాణ రంగ కార్మికుల కొరత నెలకొంది. హమాస్‌తో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇజ్రాయెల్‌లో అనేక ప్రాజెక్టులు నిలిచిపోయాయి. . ఈ క్రమంలో ఇజ్రాయెల్ విదేశాల నుంచి కార్మికులను ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగానే భారత్‌ నుంచి 6000 మంది శ్రామికులు అక్కడికి వెళ్లనున్నారు. ఏప్రిల్‌, మేలో ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి వీరిని పంపించనున్నారు. ప్రయాణ ఖర్చుల్లో రాయితీ ఇవ్వాలని ఇజ్రాయెల్‌ ప్రధాన మంత్రి కార్యాలయం, ఆర్థిక శాఖ, నిర్మాణ శాఖ సంయుక్తంగా నిర్ణయిస్తూ బుధవారం రాత్రి ఇజ్రాయెల్‌ ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.

స్థానికుల కొరత ఉన్నచోట ఇజ్రాయెల్‌ నిర్మాణ రంగం విదేశీ కార్మికులను నియమించుకుంటోంది. ఇప్పటి వరకు పాలస్తీనా అధీనంలోని వెస్ట్‌ బ్యాంక్‌ నుంచి 80,000, గాజాకు చెందిన 17,000 మంది పని చేస్తుండగా.. తాజాగా ఘర్షణల నేపథ్యంలో వారికి అనుమతిని రద్దు చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం భారత్‌ సహా పలు దేశాల నుంచి కార్మికులను ఇజ్రాయెల్ ఆ స్థానాల్లో ఆహ్వానిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news