చైనాలో మరోసారి లాక్‌డౌన్‌ విధింపు..!

చైనాలో మరోసారి లాక్‌డౌన్‌ వింధించేలా కనిపిస్తున్నాయి. పరిస్థితులు క్షీణిస్తుండటంతో మరోసారి లౌక్‌డౌన్‌ విధించే అవకాశాలు ఉన్నాయి. చైనా రాజధాని బీజింగ్‌కు దక్షిణాన ఉన్న హెబీ ప్రావిన్స్‌లో కోవిడ్‌-19 బాంబు పేలింది. దీంతో ఏకంగా 380 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. అయితే ఇంత మందిలో ఏ ఒక్కరికి కరోనా లక్షణాలు లేకపోవడం విశేషం. ఆదివారం ఒక్కరోజే 40 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 223కి చేరిందని హెబీ ఆరోగ్య అధికారులు వెల్లడించారు. మరో 161 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. వారిలో కోవిడ్‌ లక్షణాలు బయటపడలేదన్నారు.

Lockdown
Lockdown

యావత్‌ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్‌ చైనాలోని వూహాన్‌ దేశంలో పుట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడిప్పుడే కరోనా వైరస్‌ నుంచి ప్రజలు తేరుకుంటున్నారు. ఈ తరుణంలో మరోసారి కరోనా వ్యాప్తితో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. హెబీ ప్రావిన్స్‌లో కరోనా కొత్త కేసులు నమోదుకావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే హెబీ ప్రావిన్స్‌ దేశ రాజధాని నగరం బీజింగ్‌కు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. చైనాలో ఎక్కువ శాతం కేసులు బీజింగ్‌కు నైరుతి దిశగా 260 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతీయ రాజధాని షిజువాజుంగ్‌లో నమోదవుతున్నాయి.

చైనా తప్పిదం వల్ల ఇప్పటికే ప్రపంచం మొత్తం కరోనాతో పోరాడుతోంది. హెబీ ప్రావిన్స్‌లో కరోనా లక్షణాలు బయటపడుతుండటంతో అక్కడ మరోసారి లాక్‌డౌన్‌ విధించనున్నారు. అత్యధిక సంఖ్యలో కేసులు నమోదు కావడం చైనాలో ఇదే తొలిసారి. షిజియాజువాంగ్‌ నగర పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గాచెంగ్‌ జిల్లాలోని నగరంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికీ 50 వేల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కాగా, 2022లో వింటర్‌ ఒలింపిక్స్‌ హెబీలో జరగనున్నాయి. కొత్త కేసులు నమోదవుతున్న దృష్ట్యా ఒలింపిక్స్‌ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కాగా, భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌ టీకా రెండవ డ్రై రన్‌ ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేశారు. గడిచిన 24 గంటల్లో 18,139 మంది కరోనా బారిన పడితే.. 20,539 మంది కరోనా బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.