రాజీనామా చేయనున్న మలేషియా ప్రధాని.. కారణమేంటంటే,

-

మలేషియాలో ప్రస్తుతం అనిశ్చిత పరిస్థితి నెలకొంది. కరోనా కారణంగా ఆర్థికంగా తీవ్రంగా నష్టపోవడంతో ఆర్థిక మాంద్యం ఏర్పడింది. ఈ నేపథ్యంలో దేశంలో పరిస్థితులు అధ్వన్నంగా తయారయ్యాయి. ఇదిలా ఉంటే తాజాగా మలేషియా ప్రధాని మహిద్దీన్ యాసిన్, పదవికి రాజీనమా చేయనున్నారు. 17నెలల పాటు ప్రధానిగా పనిచేసిన మహీద్దీన్ యాసిన్, ఈరోజు తన రాజీనామా పత్రాన్ని అందించనున్నారు. బలనిరూపణలో మెజార్టీ కోల్పోయి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

సంకీర్ణ ప్రభుత్వంతో పాటు అంతర్గత కారణాల వల్ల మహీద్దీన్ కి సరైన మెజార్టీ లభించలేదు. దాంతో బలనిరూపణలో ఫెయిల్ అయ్యారు. ఈ కారణంగా ప్రధాని పదవికి రాజీనామా చేయనున్నారు. మహీద్దీన్ రాజీనామా అనంతరం తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మలేషియా రాజు అల్ సుల్తాన్ అబ్దుల్లా సిద్ధం అవుతున్నారు. మరికొన్ని రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు జరగనుందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news