మార్క్ మామా మజాకా.. బ్రెజిలియన్‌ యుద్ధ కళలో జుకర్ బర్గ్ కు బ్లూ బెల్ట్‌

-

టెక్ రంగంలో ఎన్నో మెలకువలు తెలిసిన మెటా సీఈవో మార్కు జుకర్ బర్గ్.. ప్రస్తుతం యుద్ధకళలపై ఫోకస్ చేశారు. తాజాగా ఆయన బ్రెజిలియన్‌ ‘జు జిట్సు’లో బ్లూ బెల్ట్‌ సాధించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. డేవ్‌ కామారిల్లో అనే కోచ్‌ వద్ద శిక్షణ తీసుకున్నట్లు మార్క్ తెలిపారు. మరో అడుగులో బ్లాక్ బెల్ట్ సొంతమవుతుందని చెప్పారు.

శిక్షణలో తన విజయం గురించి వివరిస్తూ మెటా సీఈవో పోస్టు పెట్టారు. 5వ డిగ్రీ బ్లాక్‌ బెల్ట్‌ సాధించిన డేవ్‌ కామారిల్లోకు శుభాకాంక్షలు చెప్పారు. ఆయన ఓ గొప్ప శిక్షకుడని.. ఆయన శిక్షణలో తాను పోరాటం, జీవితం గురించి చాలా నేర్చుకున్నానని అన్నారు. బ్లూ బెల్ట్‌ సాధించేలా పదోన్నతి పొందడం గౌరవంగా భావిస్తున్నానని ఆ పోస్టులో జుకర్ బర్గ్ వెల్లడించారు.

జుకర్ బర్గ్ పోస్టుకు డేవ్ రిప్లై ఇచ్చారు. ‘మీ గురించి తెలుసుకోవడం, నేర్చుకోవడం గౌరవంగా భావిస్తున్నా. మీ ఆసక్తికి ధన్యవాదాలు. శిక్షణ కాలంలో అద్భుతమైన క్రమశిక్షణ ప్రదర్శించారని’ మార్క్‌ వ్యక్తిత్వాన్ని కొనియాడారు.

Read more RELATED
Recommended to you

Latest news