బీఆర్ఎస్ మాకు మిత్రులు గానే చూస్తున్నామన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ కూడా మాకు మిత్రులేనని, కమ్యూనిస్టులు ఎక్కడ ఉన్నారనే మాట హరీష్ ఎందుకు అన్నారో తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. మునుగోడులో గెలిచినప్పుడు తెలియదా..? అని ఆయన ప్రశ్నించారు. కమ్యూనిస్టులు లేకుంటే మునుగొడులో గెలిచే వారా..? అని ఆయన ప్రశ్నించారు. మునుగొడులో మేము లేకుంటే.. బీజేపీ గెలిచేదని, బీజేపీని కట్టడి చేయడం బీఆర్‌ఎస్ వల్ల అయ్యేదా..? అని ఆయన మండిపడ్డారు.
కాగా, మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్… బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పైన స్వల్ప మెజార్టీతో గెలిచింది. అయితే ఈ గెలుపుకు కమ్యూనిస్ట్ పార్టీలు మద్దతివ్వడమే కారణమనే వాదనలు ఉన్నాయి. బీఆర్ఎస్ కు వచ్చిన మెజార్టీ అంతా కమ్యూనిస్ట్ ఓట్ల కారణంగానే వచ్చిందని అంటారు. ఈ నేపథ్యంలో తమ మద్దతు లేకుండానే బీఆర్ఎస్ గెలిచిందా? అని కమ్యూనిస్టులు అధికార పార్టీని పలుమార్లు ప్రశ్నించారు.