భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడ్రోజుల పాటు అమెరికాలో పర్యటించారు. ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ వ్యక్తిగత పిలుపుతో మోదీ యూఎస్‌లో పర్యటించారు. ఈ క్రమంలో ఆయన అక్కడి కాంగ్రెస్ ప్రతినిధుల సభలో ప్రసంగించారు. అనంతరం వైట్‌హౌస్‌లో బైడెన్ దంపతులు ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు. ఆ తర్వాత కమలా హ్యారిస్ ఇచ్చిన డిన్నర్‌కు కూడా హాజరయ్యారు. న్యూయార్క్ నుంచి శుక్రవారం రోజున వాషింగ్టన్ చేరుకున్న మోదీ.. అక్కడి రోనాల్డ్ రీగన్ బిల్డింగ్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో అమెరికా మేటి సింగర్ మేరీ మిల్‌బెన్.. భారత జాతీయ గీతం జనగణమణ గీతాన్ని ఆలపించారు. ప్రధాని మోదీ సమక్షంలో ఆమె భారత జాతీయ గీతాన్ని పాడారు. సభకు హాజరైన జనం కూడా తనతో గొంతుకలిపి పాడడం సంతోషంగా ఉందని ఆమె అన్నారు. జనం గొంతుల్లో ఉన్న ఆ అభిమానాన్ని చూడవచ్చని అన్నారు. భారత జాతీయ గీతాన్ని ఆలపించడం సంతోషంగా ఉందని సింగర్ మేఈ మిల్‌బెన్ తెలిపారు. ఇది ఎప్పటికీ మరిచిపోని రోజు అని ఆమె తన ట్విటర్‌లో వెల్లడించారు. జనగణమన పాడిన తర్వాత ఆ సింగర్ స్టేజ్‌పై మోదీ కాళ్లకు పాదాభివందనం చేశారు.
#WATCH | Award-winning international singer @MaryMillben performs the Indian National Anthem at the Ronald Reagan Building in #WashingtonDC #HistoricStateVisit2023 #ModiInUSA #IndiaUSAPartnership pic.twitter.com/pIsXoJlodx
— DD News (@DDNewslive) June 24, 2023