రఫాపై ఇజ్రాయెల్ దాడి.. తప్పు చేశామని అంగీకరించిన నెతన్యాహు

-

రఫాపై ఇజ్రాయెల్ వరుస దా డుల్లో ఇ ప్పటి వరకు 45 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిని తక్షణం నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ఆదేశాలు ఇచ్చినా, అమెరికా సహా ప్రపంచమంతా మొత్తుకుంటున్నా ఇజ్రాయెల్ ఖాతరు చేయడం లేదు. దాడి జరిగిన తల్ అల్ సుల్తాన్ ప్రాంతాన్ని సురక్షిత ప్రాంతంగా ఇజ్రాయెల్ ప్రకటించింది.

అయితే రఫాపై దాడి విషయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు విచారం వ్యక్తం చేశారు. తప్పు చేశామని పార్లమెంటులో అంగీకరించారు. సాధారణ పౌరులకు ఎలాంటి హాని చేయకూడదని అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నా ఈ విషాద ఘటన జరిగిందని.. ఘటనపై దర్యాప్తు చేస్తామని ప్రకటించారు. రఫాపై చేసిన దాడిని ఇజ్రాయెల్‌కు అత్యంత సన్నిహిత దేశాలైన అమెరికా, ఫ్రాన్స్ సహా స్పెయిన్ , ఇటలీ, ఐర్లాండ్, నార్వే, ఈజిప్టు, ఖతార్ తుర్కియే ఖండించాయి. అటు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ కూడా ఈ దాడిని తప్పుబట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news